SEBI Recruitment 2024: సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల భర్తీ; అర్హత డిగ్రీనే..
స్టాక్ మార్కెట్ కార్యకలాపాలను నియంత్రించే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్ సైట్ sebi.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్సైట్ sebi.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 97 ఆఫీసర్ గ్రేడ్ ఎ పోస్టులను భర్తీ చేయనున్నారు.
జూన్ 30 లాస్ట్ డేట్
సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 11న ప్రారంభమై 2024 జూన్ 30న ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాల కోసం సెబీ అధికారిక వెబ్సైట్ sebi.gov.in ను చూడండి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు ప్రారంభ తేదీ: జూన్ 11, 2024
- దరఖాస్తు చివరి తేదీ: జూన్ 30, 2024
- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష: జూలై 27, 2024
- ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష: ఆగస్టు 31, 2024
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ ఫేజ్ 2 పేపర్ 2: సెప్టెంబర్ 14, 2024
ఖాళీల వివరాలు
- జనరల్: 62 పోస్టులు
- లీగల్: 5 పోస్టులు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ: 24 పోస్టులు
- పరిశోధన: 2 పోస్టులు
- అధికార భాష: 2 పోస్టులు
- ఇంజినీరింగ్: 2 పోస్టులు
అర్హత ప్రమాణాలు
విద్యార్హత, వయోపరిమితిని సెబీ అధికారిక వెబ్సైట్ sebi.gov.in లో పరిశీలించవచ్చు.
ఎంపిక విధానం
ఫేజ్ 1 (100 మార్కులకు రెండు పేపర్లతో కూడిన ఆన్ లైన్ స్క్రీనింగ్ ఎగ్జామినేషన్), ఫేజ్ 2 (100 మార్కులకు రెండు పేపర్లతో కూడిన ఆన్ లైన్ ఎగ్జామినేషన్), ఫేజ్ 3 (ఇంటర్వ్యూ) అనే మూడు దశల ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు
- అన్ రిజర్వ్ డ్ /ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ : అప్లికేషన్ ఫీజు కమ్ ఇన్ఫర్మేషన్ ఛార్జీలుగా రూ.1000+- 18 శాతం జీఎస్టీ
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు: రూ.100/- ఇన్ఫర్మేషన్ ఛార్జీలు + 18 శాతం జీఎస్టీ
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సెబీ అధికారిక వెబ్సైట్ sebi.gov.in ను చూడవచ్చు.