Volkswagen Taigun facelift : వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. వచ్చేస్తోంది!
Volkswagen Taigun facelift : వోక్స్వ్యాగన్ టైగన్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రానుందని సమాచారం. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
2024 Volkswagen Taigun : ఇండియన్ రోడ్ల మీద వోక్స్వ్యాగన్ టైగన్ రెండేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా పరుగులు పెడుతోంది. ఇక ఇప్పుడు.. ఈ మోడల్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను తీసుకొచ్చేందుకు ఈ జర్మన్ సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 వోక్స్వ్యాగన్ టైగన్ మోడల్.. ఇప్పటికే టెస్ట్ డ్రైవ్ దశలో ఉన్నట్టు సమాచారం.
2024 వోక్స్వ్యాగన్ టైగన్ ఇలా..!
2021లో టైగన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది వోక్స్వ్యాగన్ సంస్థ. ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్‌ఫామ్ మీద రూపొందించింది. ఇండియా 2.0 స్ట్రాటజీలో భాగంగా టైగన్‌ను తీసుకొచ్చింది. ఈ ఎస్‌యూవీకి గ్లోబల్- ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ దక్కింది. ఇక ఇప్పుడు దీని ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రాబోతోంది.
Volkswagen Taigun facelift : 2024 వోక్స్వ్యాగన్ టైగన్‌లో డిజైన్ ప్రస్తుత మోడల్‌లానే ఉండే అవకాశం ఉంది. పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. ఇందులో రీడిజైన్డ్ బంపర్స్, మస్క్యులర్ బానెట్, స్లీక్ గ్రిల్, ప్రాజెక్టర్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, స్కిడ్ ప్లేట్స్, రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, డిజైనర్ అలాయ్ వీల్స్ ఉంటాయి. రేర్‌లో ఫుల్- విడ్త్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, షార్క్- ఫిన్ యాంటీనా, రూఫ్- మౌంటెడ్ స్పాయిలర్ ఉండనున్నాయి.
వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇంటీరియర్‌లో ఎలాంటి మార్పులు చేస్తున్నారు? అన్న విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. అయితే.. ఇందులో డ్యూయెల్ టోన్ డాష్‌బోర్డ్, ప్రీమియం అప్‌హోలిస్ట్రీ, యాంబియెంట్ లైటింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వయర్లెస్ ఛార్జర్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫుల్లీ- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ ప్యానెల్ వంటివి ఉండొచ్చు.
ప్యాసింజర్ సేఫ్టీ కింద 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈఎస్సీ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.
వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ఇంజిన్..
2024 Volkswagen Taigun launch in India :2024 వోక్స్వ్యాగన్ టైగన్‌లో 1.0 లీటర్, 3 సిలిండర్, టీఎస్ఐ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇది 113.4 హెచ్‌పీ పవర్‌ను, 178 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. మరోవైపు 1.5 లీటర్ ఇన్లైన్-4 టీఎస్ఐఈవీఓ మోటార్ ఆప్షన్ కూడా ఉంది. ఇది 148 హెచ్‌పీ పవర్‌ను, 250 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
2024 వోక్స్వ్యాగన్ టైగన్ ధర..
వోక్స్వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ ధరకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ మోడల్ ఎక్స్‌షోరూం ధరలు రూ. 11.56లక్షలు - రూ. 18.96లక్షల మధ్యలో ఉండొచ్చు.
సంబంధిత కథనం