తెలుగు న్యూస్ / ఫోటో /
Volkswagen ID.7 Electric Car: సూపర్ ఫీచర్లతో ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 ఎలక్ట్రిక్ సెడాన్
- Volkswagen ID.7 Electric Car: ఐడీ.7 ఎలక్ట్రిక్ సెడాన్‍ను ప్రపంచానికి పరిచయం చేసింది ఫోక్స్‌వ్యాగన్ సంస్థ. సీఈఎస్ 2023 ఈవెంట్‍లో దీన్ని అన్‍వీల్ చేసింది. కొత్త టెక్నాలజీలు, సూపర్ ఫీచర్లతో ఈ ఎలక్ట్రిక్ సెడాన్ వస్తోంది. త్వరలో చైనా, యూపర్, ఉత్తర అమెరికాలో సేల్‍కు వస్తోంది. ఈ ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 వివరాలపై ఓ లుక్కేయండి.

(1 / 10)
ఐడీ బ్యాడ్జ్ ఈవీ రేంజ్‍లో జర్మన్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్.. కొత్తగా ఐడీ.7 ఎలక్ట్రిక్ సెడాన్ తీసుకొస్తోంది.
(2 / 10)
ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 ఎలక్ట్రిక్ సెడాన్‍ను లాస్‍వేగాస్‍లో జరుగుతున్న సీఈఎస్ 2023లో ప్రదర్శించింది ఫోక్స్‌వ్యాగన్. అయితే ఎక్స్‌టీరియర్ గురించి ఎక్కువ తెలియకుండా ఈ మోడల్‍కు ప్రత్యేకమైన కామోఫ్లోజ్ పెయింట్‍ను వేసి, అన్‍వీల్ చేసింది. ఇంటీరియర్ టెక్నాలజీ, ఫీచర్లు బయటికి వచ్చాయి.
(3 / 10)
కామోఫ్లోజ్ ఉన్నా,. ఈ ఎలక్ట్రిక్ సెడాన్‍కు చెందిన కొన్ని ఎక్స్‌టీయర్ విషయాలు తెలుస్తున్నాయి. ఎంతో స్లీక్‍గా.. స్పోర్టీ లుక్‍తో ఈ సెడాన్ వస్తుందని తెలుస్తోంది.
(4 / 10)
The car gets sleek and sharp LED headlamps with multi-beam appearance for string illumination.
(5 / 10)
ఎల్ఈడీ టైల్‍లైట్స్ కూడా షార్ప్ షేప్‍లో ఉన్నాయి. దీని లిప్ స్పాయిలర్ కూడా ఈ సెడాన్‍కు స్పోర్టీ ఫీల్‍ను ఇస్తోంది.
(6 / 10)
కొలతల విషయానికి వస్తే, ఈ ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 సెడాన్.. 194.5 ఇంచుల పొడవు ఉంటుంది. వీల్ బేస్ 116.9 ఇంచులుగా ఉంది.
(8 / 10)
15.0 ఇంచుల టచ్ స్ట్రీన్, మెరిసే టార్చ్ స్లైడర్లు, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‍ప్లే ఈ ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 క్యాబిన్‍లో ఉంది. బయటి వాతావరణాన్ని బట్టి కారులోని టెంపరేచర్‌ను ఆటోమేటిక్‍గా అడ్జస్ట్ చేసే డిజిటల్లీ కంట్రోల్డ్ ఎయిర్ వెంట్స్ ఉంటాయి.
(9 / 10)
ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఫోక్స్‌వ్యాగన్ ఐడీ.7 ఎలక్ట్రిక్ సెడాన్‍లో 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది.
ఇతర గ్యాలరీలు