YS Sharmila - CBN : చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల-ys sharmila invites chandrababu for her son marriage ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila - Cbn : చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల

YS Sharmila - CBN : చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 13, 2024 01:24 PM IST

YS Sharmila Meet Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు వైఎస్ షర్మిల. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల… చంద్రబాబుతో భేటీ రాజకీయకోణంలో చూడొద్దని కోరారు.

చంద్రబాబుతో వైఎస్ షర్మిల
చంద్రబాబుతో వైఎస్ షర్మిల (TDP Twitter)

YS Sharmila Meet Chandrababu: కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల… హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల…. వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించానని చెప్పారు. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరానని తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని… సాధారణ భేటీగానే చూడాలని కోరారు. ఎక్కువ సేపు వైఎస్ఆర్ ప్రస్థానం గురించే మాట్లాడుకున్నామని షర్మిల వెల్లడించారు.

yearly horoscope entry point

రాహుల్ ప్రధాని కావాలి - వైఎస్ షర్మిల

“వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ జరిగింది. వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు. రాజకీయ జీవితంలో వైఎస్సార్ తో ఉన్న అనుభవాలు అన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తాను. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలి. రాహుల్ ప్రధాని అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. రాహుల్ ను ప్రధాని చేయడమే వైఎస్సార్ లక్ష్యం. నాకు భాద్యతలు ఇచ్చిన అంశం బట్టి చేరికల మీద తర్వాత చెప్తాం. చంద్రబాబు ను కలవడం రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. నేను గతంలో క్రిస్మస్ కేకు పంపితే తప్పు పట్టారు. నేను చంద్రబాబు కే కాదు అందరికీ పంపాం. ఇక్కడ కేటీఆర్,హరీష్,కవిత గారికి కూడా పంపా. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు. రాజకీయాలు ప్రజల కోసం చేస్తున్న సర్వీస్. రాజకీయాలు అనేది మా ప్రొఫెషన్. ఈ క్రమంలో ఒకరిని ఒకరు మాటలు అనుకుంటాం. కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమే. అందరం ప్రజల కోసమే పని చేయాలి. పండుగకో,లేదా పెళ్లికి కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదు” అని వ్యాఖ్యానించారు వైఎస్ షర్మిల.

ఇప్పుడు చంద్రబాబును కేవలం పెళ్లికి మాత్రమే పిలవడానికి వచ్చానని చెప్పారు వైఎస్ షర్మిల. చంద్రబాబు ఒక పార్టీకి అధ్యక్షుడు అని… తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అని చెప్పుకొచ్చారు. మాకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవు అని… వైఎస్సార్ తన బిడ్డల పెళ్లికి చంద్రబాబును పిలిచారని గుర్తు చేశారు. మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి దీవించారని చెప్పారు.

ఈ నెల 18న రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధం జరగనుంది. ఫిబ్రవరి 17న వివాహ వేడుక నిర్వహించనున్నారు. కుమారుడి వివాహ వేడుక విషయాలను ఇప్పటికే ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు షర్మిల. ఇక మొదటి ఆహ్వానపత్రికను సోదరుడు, ఏపీ సీఎం జగన్ కు అందజేశారు. ఇక వివాహ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు.

Whats_app_banner