ప్రధానికి జగన్ లేఖ.. ఆ విషయంలో కేంద్రానికి మద్దతు
CM YS Jagan | ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ రాశారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల్లో కేంద్రం ప్రతిపాదించిన మార్పులకు మద్దతిస్తున్నట్టు ప్రకటించారు.
IAS cadre rules amendment news | ఐఏఎస్ కేడర్ నిబంధనల్లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మద్దతునిచ్చారు. ఈ మేరకు ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ సవరణలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
అయితే రాష్ట్రాలతో సంబంధం లేకుండా.. అధికారులను డిప్యుటేషన్‌కు తీసుకెళ్లే నిబంధనను పునఃపరిశీలించాలని లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్. కేంద్రం ప్రతిపాదించిన నిబంధనలు అమల్లోకి వచ్చి.. ఐఏఎస్‌లు అకస్మాత్తుగా డిప్యుటేషన్ మీద వెళ్లిపోతే.. కీలక ప్రాజెక్టులు, పథకాల ఆగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిపాదలకు మద్దతు..
ఐఏఎస్ కేడర్ రూల్స్- 1954లో కొన్ని మార్పులను ప్రతిపాదించిన కేంద్రం.. ఈ విషయంపై స్పందించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. ఇప్పటివరకు 9 రాష్ట్రాలు ప్రతిపాదనలను వ్యతిరేకించగా.. ఏపీతో కలిపి మరో 9 రాష్ట్రాలు మద్దతునిచ్చాయి. ఇప్పటి వరకు పరస్పర సంప్రదింపులతో కేంద్రం- రాష్ట్రాలు అధికారులను డిప్యుటేషన్ మీద పంపేవి. తాజా ప్రతిపాదన అమల్లోకి వస్తే.. కేంద్రం ఎప్పుడు, ఎవరిని డిప్యుటేషన్ మీద పంపాలని ఆదేశించినా.. రాష్ట్రాలు జోక్యం చేసుకోకూడదు.
సంబంధిత కథనం