Visakha Railway Station : ఇక విశాఖ రైల్వే స్టేషన్ చూస్తే వావ్.. అంటారు-visakhapatnam railway station set to get a world class makeover see images here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Railway Station : ఇక విశాఖ రైల్వే స్టేషన్ చూస్తే వావ్.. అంటారు

Visakha Railway Station : ఇక విశాఖ రైల్వే స్టేషన్ చూస్తే వావ్.. అంటారు

HT Telugu Desk HT Telugu
Jul 15, 2022 07:30 AM IST

ఇక కొన్ని రోజుల్లో విశాఖపట్నం రైల్వే స్టేషన్ చూస్తే.. ఆశ్చర్యపోతారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విశాఖ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోనుంది.

<p>విశాఖపట్నం రైల్వే స్టేషన్ నమూనా</p>
విశాఖపట్నం రైల్వే స్టేషన్ నమూనా (twitter)

విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అధునాతన సౌకర్యాలు మూడేళ్లలో అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద పనులు చేయనున్నారు. రైల్వే స్టేషన్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు, అత్యాధునిక స్కైవాక్‌లు, స్మార్ట్ పార్కింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, మరిన్ని ఉంటాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

అప్‌గ్రేడేషన్ ప్రాజెక్టుకు దాదాపు రూ. 393.76 కోట్లు ఖర్చవుతుందని అంచనా. రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్‌ఎల్‌డీఎ) ద్వారా అప్‌గ్రేడేషన్ పనులు చేపడతారు. ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అధికారులు మూడేళ్లు గడువు విధించారు. ప్రాజెక్ట్ కోసం RLDA బిడ్‌లను కోరుతోంది. బిడ్ సమర్పణలకు ఆగస్టు 12వ తేదీ వరకు గడువు పెట్టారు.

RLDA వైస్-ఛైర్మెన్ వేద్ ప్రకాష్ దూదేజా మాట్లాడుతూ.. విశాఖపట్నం దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఇటీవలి కాలంలో ఐటీ రంగం వృద్ధితో నగరంలో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరభివృద్ధి స్థానిక ఆర్థిక వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది. వృద్ధిని మరింత వేగవంతం చేస్తుంది.

విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను అప్‌గ్రేడేషన్ చేయడంలో అత్యాధునిక స్కైవాక్‌లు ప్రయాణికులను ప్లాట్‌ఫారమ్‌ల మధ్య సజావుగా వెళ్లడానికి ప్లాట్‌ఫారమ్‌లపై రూఫ్ ప్లాజాను ఏర్పాటు చేస్తారు. ఇవి డిపార్చర్ హాల్స్, కామన్ వెయిటింగ్ ఏరియాలను కలుపుతాయి.

మొబైల్ యాప్‌ల ద్వారా పార్కింగ్ స్లాట్‌లను బుక్ చేసుకోవడానికి ప్రయాణికులకు సహాయపడేందుకు స్టేషన్‌లో IOT ఆధారిత పార్కింగ్ నిర్వహణ ఉంటుంది. స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం బహుళ కార్యాలయాలు, రిటైల్ స్థలాలు, క్లోక్‌రూమ్, రిటైరింగ్ గదులు కూడా ఉంటాయి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నం-శ్రీకాకుళం జాతీయ రహదారికి సమీపంలో ఉంది.

స్టేషన్‌కు యూనివర్సల్‌ యాక్సెస్‌ ఉండేలా స్కైవాక్‌ సౌకర్యం ఉంటుంది. బయటకు వెళ్లే ప్రయాణికుల హాళ్లను కలుపుతూ రూఫ్‌ ప్లాజా. కామన్‌ వెయిటింగ్‌ హాల్. కమర్షియల్‌ ఏరియా. అంటే..వ్యాపారాలకు అనువైన స్థలాలు కూడా ఉంటాయి. ఐఓటీ విధానంలో నడిచే స్మార్ట్‌ కారు పార్కింగ్‌ ఏర్పాటు చేస్తారు. మెడికల్‌ కేర్‌ సెంటర్‌ కూడా ఉంటుంది. విశాఖపట్నం నగర ప్రజల జీవన శైలిని మార్చేలా, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ఈ స్టేషన్‌ దోహదపడాలనేది ఆర్‌ఎల్‌డీఏ ప్రధాన ఉద్దేశంగా ఉంది. దాని కోసం రైల్వే స్టేషన్‌లో రిటైల్‌ వ్యాపారాలతో పాటు ఆఫీసుల నిర్వహణకు అవసరమైన సౌకర్యం కూడా ఇస్తారు.

Whats_app_banner