IGNOU Admission Extended : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) జవవరి-2024 అడ్మిషన్ల(ODL/Online) దరఖాస్తు గడువును(IGNOU Admissions) పెంచుతున్నట్లు ప్రకటించింది. దూర విద్య కోర్సులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇగ్నో విశాఖపట్నం రీజనల్ స్టడీ సెంటర్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అన్ని సర్టిఫికెట్, డిప్లమో, పీజీ డిప్లమో, ఎంబీఏ ప్రవేశాలకు మార్చి 31 వరకు గడువు పెంచుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులు ఇగ్నో అధికారిక వెబ్‌సైట్ https://ignouadmission.samarth.edu.in/లో లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
Step 1 : ఇగ్నో అధికారిక వెబ్ సైట్ ignou.ac.in ను సందర్శించండి.
Step 2 : హోంపేజీలో Register Online లో Fresh Admission Online/ Distance లింక్ క్లిక్ చేయండి.
Step 3 : తర్వాత పేజీలో న్యూ రిజిస్ట్రేషన్ అయితే అభ్యర్థి వివరాలు నమోదు చేయాలి. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వండి.
Step 4 : లాగిన్ అయిన తర్వాత కోర్సు వివరాలు నమోదు చేసి, పేమెంట్ చెల్లించాల సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థి ముందుగా స్కాన్ చేసిన ఫొటో (100 KB కంటే తక్కువ), స్కాన్ చేసిన సంతకం (100 KB కంటే తక్కువ), సంబంధిత విద్యా అర్హత సర్టిఫికెట్ల స్కాన్ కాపీలు (200 KB కంటే తక్కువ), ఎక్స్ పీరియాన్స్ సర్టిఫికెట్ స్కాన్ చేసిన కాపీ (ఏదైనా ఉంటే) (200 KB కంటే తక్కువ), ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ స్కాన్ చేసిన కాపీ సిద్ధం చేసుకోవాలి. అభ్యర్థి అడ్మిషన్ రుసుమును క్రెడిట్ కార్డ్ (మాస్టర్/వీసా), డెబిట్ కార్డ్ (మాస్టర్/వీసా/రూపే), నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఒరిజినల్ సర్టిఫికేట్ల స్కాన్ కాపీలు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల అప్లోడ్, ఫీజు చెల్లింపు తర్వాత ప్రివ్యూ చూసుకుని సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
ఆంధ్ర యూనివర్సిటీలో (Andhra University)ఇంజినీరింగ్ కాలేజీలో పలు కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ (AUEET 2024) విడుదలైంది. ఏయూ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ద్వారా సెల్ఫ్ సపోర్ట్ విధానంలో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. వీటిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో 360 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 60 సీట్లు, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 30, సివిల్ ఇంజనీరింగ్‌లో 30, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో 30 సీట్లు ఉన్నాయి. కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఇంటర్ పరీక్షలకు హాజరైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అడ్మిషన్ పొందే సమయానికి అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడు క్యాటగిరీ అభ్యర్థులకు 40శాతం మార్కులతో ఉత్తీర్ణత సరిపోతుంది.
సంబంధిత కథనం