Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం-union bank apprentice 2024 for 500 vacancies online application process dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

Bandaru Satyaprasad HT Telugu
Aug 28, 2024 03:26 PM IST

Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 500 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 17లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 50, తెలంగాణలో 42 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి.

యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం
యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం

Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో 500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. నేటి(ఆగస్టు 28) నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 50, తెలంగాణలో 42 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో యూబీఐ పేర్కొంది.

అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలో ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందు, అభ్యర్థులు అర్హతలను ఒకసారి పూర్తిగా పరిశీలించాలని యూబీఐ సూచించింది. అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లలో https://www.apprenticeshipindia.gov.in , https://nats.education.gov.in మాత్రమే నమోదు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు హార్డ్ కాపీ, ఇతర పత్రాలు యూబీఐ ఆఫీసుకు పంపవలసిన అవసరంలేదని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం...ఆయా రాష్ట్రాలలో SC/ST/OBC/PWD మొదలైన వారికి అప్రెంటిస్ ఎంపికలలో రిజర్వేషన్లు అమలుచేస్తారు. జనరల్‌, ఓబీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులు రూ.600, దివ్యాంగులకు రూ.400 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

అర్హతలు

కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 01 ఆగస్టు, 2024 నాటికి 28 సంవత్సరాలు అంటే 02.08.1996, 01.08.2004 మధ్య పుట్టిన వారు దరఖాస్తుకు అర్హులు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకారం SC/ST/OBC/PWD మొదలైన వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. 17 సెప్టెంబర్, 2024 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

నెలకు రూ.15 వేలు స్టైఫండ్

అప్రెంటిస్ షిప్ బ్యాంకులో ఉద్యోగం కాదు, అలాగే కాంట్రాక్టు ఉద్యోగం కూడా కాదని అభ్యర్థులు గమనించాలి. అప్రెంటిస్‌గా నియమితులైన వారిని యూబీఐ ఉద్యోగులుగా పరిగణించదు. అప్రెంటిస్ షిప్ లో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. అప్రెంటిస్‌కు బ్యాంకింగ్ పద్ధతులు, వివిధ అంశాలపై ఉద్యోగ శిక్షణ ఇస్తారు. శిక్షణలో అప్రెంటిస్‌లకు నెలకు రూ.15 వేలు స్టైఫండ్‌ ఇస్తారు. ఇతర అలవెన్సులు, ప్రయోజనాలకు అప్రెంటిస్ లు అర్హులు.

ఖాళీలు

దేశవ్యాప్తంగా మొత్తం అప్రెంటిస్ లు - 500 (ఏపీలో 50, తెలంగాణలో 42 ఖాళీలు)

ఎంపిక విధానం

ఆన్‌లైన్ పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్), లోకల్ లాంగ్వేజ్ నాలెడ్జ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్షలో జనరల్/ఫైనాన్షియల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ & రీజనింగ్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగంలో 25 ప్రశ్నలు 25 మార్కులు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు 60 నిమిషాల సమయం ఉంటుంది.

ఆన్ లైన్ దరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. పరీక్షలు, ఎంపిక ఇతర వివరాలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా యూబీఐ సమాచారం అందిస్తుంది.
  • అభ్యర్థులు ముందుగా కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్స్ NAPS, NATS లో నమోదు చేసుకోవాలి.( https://www.apprenticeshipindia.gov.in (అభ్యర్థులందరికీ) , https://nats.education.gov.in (1 ఏప్రిల్ 2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే))
  • అభ్యర్థులు అప్రెంటిస్‌ పోర్టల్‌ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలి.
  • NAPS, NATS పోర్టల్‌లో నమోదు చేసుకున్న అభ్యర్థులు అప్రెంటిస్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
  • ఈ లింక్‌ https://www.apprenticeshipindia.gov.in/apprenticeship/opportunity పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి. NATS పోర్టల్ https://nats.education.gov.in/student_type.php లో అభ్యర్థులు లాగిన్ అయిన తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్‌షిప్ ప్రకటనను చూడవచ్చు.
  • దరఖాస్తు చేసిన అభ్యర్థులందరూ తమ అప్రెంటీస్ రిజిస్ట్రేషన్ కోడ్ ను భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.
  • NAPS, NATSలో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ జిల్లా ఎంపిక, మరికొన్ని వివరాలను BFSI SSC (naik.ashwini@bfsissc.com) ద్వారా ఈమెయిల్‌ను పొందుతారు. శిక్షణ కోసం, ఆన్‌లైన్ పరీక్ష కోసం చెల్లింపు పూర్తి చేయాలి.
  • పరీక్ష రుసుమును డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/UPI ఉపయోగించి చెల్లించవచ్చు.
  • ఫీజు చెల్లించిన తర్వాత రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడీకి ఈ-రసీదు వస్తుంది.

సంబంధిత కథనం