Union Bank SO Recruitment 2024: యూనియన్ బ్యాంక్ లో 606 పోస్ట్ లకు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్-union bank so recruitment 2024 last date to apply for 606 posts direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Union Bank So Recruitment 2024: యూనియన్ బ్యాంక్ లో 606 పోస్ట్ లకు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

Union Bank SO Recruitment 2024: యూనియన్ బ్యాంక్ లో 606 పోస్ట్ లకు అప్లై చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్

HT Telugu Desk HT Telugu
Feb 23, 2024 01:26 PM IST

606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు అప్లై చేయని ఆర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2024 ఫిబ్రవరి 23న ముగించనుంది. ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తరువాత దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ 2024 మార్చి 9 వరకు ఉంటుంది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇలా అప్లై చేయండి

యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.

  • ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్మెంట్ లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఆన్ లైన్ లో దరఖాస్తు లింక్ అందుబాటులో ఉంటుంది.
  • ఆ లింక్ పై చేసి రిజిస్ట్రేషన్ వివరాలు నమోదు చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి.
  • అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్ అవసరాల కోసం హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
  • దరఖాస్తు ఫీజు జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.175. ఆన్లైన్ విధానంలోనే చెల్లింపులు జరపాలి.
  • మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ unionbankofindia.co.in ను చూడవచ్చు.

Whats_app_banner