TTD Board: నేడోరేపో టీటీడీ పాలక మండలి ఖరారయ్యే అవకాశం
TTD Board: టీటీడీ పాలక మండలిని నేడో రేపో ప్రకటించే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీటీడీ పాలక మండలి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పాలకమండలి కూర్పు కూడా కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కూర్పు కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం 24మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రభుత్వం ప్రకటిస్తుందని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. పాలకమండలిలో ఎమ్మెల్యేల కోటాలో పొన్నాడ సతీష్, తిప్పే స్వామి, కరణం ధర్మశ్రీలకు చోటు దక్కునున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురి పేర్లను ఎమ్మెల్యే కోటాలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వీరితో పాటు మేకా శేషుబాబు, ఆనంద్ రెడ్డి, సనత్ రెడ్డి, పోకల అశోక్ కుమార్‌లకు పాలకమండలిలో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. మరోవైపు రంపచోడవరం నుంచి ఎస్టీ మహిళకు ఈ దఫా టీటీడీ పాలక మండలిలో అవకాశం దక్కనుంది. ఈ కోటాలో దాట్ల రమణమ్మ పేరును ఖరారు చేసే అవకాశం ఉంది.
మహారాష్ట్ర నుంచి అమూల్ కాలే, మిలింధర్, సౌరబ్ పేర్లు జాబితాలో ఉండనున్నాయి. కర్ణాటక నుంచి దేశ్‌పాండే, విశ్వనాథ్‌లకు చోటు దక్కనుంది. తమిళనాడు నుంచి తిర్పూర్ బాల పేరు పాలక మండలిలో ఉండొచ్చని చెబుతున్నారు. తెలంగాణ నుంచి రామేశ్వరరావు కుటుంబం నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందని చెబుతున్నారు.