IAS Officers Transfer in AP: పలువురు ఐఏఎస్‌ల బదిలీ
ఆంధ్రప్రదేశ్ లో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ias officers transfer in andhra pradesh:ఏపీలో పలువురు ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది.
ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీగా వీర పాండ్యన్, మార్క్ ఫెడ్ జేఎండీగా కూడా ఆయనే అదనపు బాధ్యతలను చూడనున్నారు. ఏపీ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్‌గా రిటైర్డ్ సీఎస్ ఆదిత్యనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏక సభ్య కమిషన్
మరోవైపు వాల్మీకి, బోయ కులాను ఎస్టీలో చేర్చటంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ ఏక సభ్యుడిగా కమిషన్ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం 60 రోజులు ఉన్న చైల్డ్ కేర్ లీవ్స్‌ను కాస్త.. 180 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సెలవులను 10 విడతల్లో ఉపయోగించుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.