CBN Letter To ECI :ఎన్నికల కమిషన్‌కు చంద్రబాబు ఫిర్యాదు….
CBN Letter To ECI ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్‌కు లేఖను రాశారు. ఎన్నికల్లో అక్రమాలను, ఉల్లంఘనలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CBN Letter To ECI ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఎన్నికల్లో వెలుగు చూసిన అక్రమాలను, ఉల్లంఘనలకు వివరించి తక్షణ చర్యలు కోరుతూ లేఖ రాశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఉల్లంఘించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి శ్రీమతి ఉషా శ్రీచరణ్‌ని డబ్బుల పంపిణీపై పార్టీ క్యాడర్‌కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట పడిందని, ఓటుకు రూ.1000 పంచాలని స్వయంగా మంత్రి చెప్పారని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఎంపీ మిథున్ రెడ్డి కడప క్రాస్ నుండి తంబళ్లపల్లి వరకు ర్యాలీ నిర్వహించారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. 48 గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉన్నా...ఆ నిబంధనలు ఎంపి ఉల్లంఘించారని అన్నారు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలోని వార్డు నెం. 16, బూత్ నంబర్: 232లో వైఎస్‌ఆర్‌సిపి అనుచరుడు ఈశ్వరరావు డబ్బు పంపిణీ చేస్తూ పట్టుబడ్డాడడని పేర్కొన్నారు.
తిరుపతి పట్టణంలో 9వ తరగతి విద్యార్హత కలిగిన విజయ అనే మహిళ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అక్రమ ఓటు వేసిందని, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైసీపీ అనుచరులు రమణ మహర్షి స్కూల్ వద్ద డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారని పేర్కొన్నారు. . తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అతని కుమారుడు అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ పోలింగ్ బూత్‌లలోకి అక్రమంగా ప్రవేశించారని వివరించారు.
తిరుపతి పోలింగ్ బూత్ నెం. 233, 233A లలోకి అక్రమగా ప్రవేశించడమే కాకుండా టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారన్నారు. బోగస్ ఓట్లపై ప్రశ్నించిన టీడీపీ నేత దేవనారాయణరెడ్డిని అక్రమంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్నారని, ఒంగోలు పట్టణంలో టీడీపీ టెంట్ వేయడానికి అంగీకరించని పోలీసులు వైసీపీ నాయకులకు మాత్రం అనుమతి ఇచ్చారని ఫిర్యాదు చేశారు.
విశాఖలోని 53వ వార్డు YSRCP కార్పొరేటర్ బర్కత్ అలీ ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తూ వీడియోలో పట్టుబడ్డారని, బోగస్ ఓటర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు తిరుపతి పట్టణంలో టీడీపీ నేతలు నర్సింహ యాదవ్, ఇతర నేతలను అరెస్టు చేశారన్నారు. వైసీపీ బోగస్ ఓట్లకు సహకరించేందుకే పోలీసులు ఈ అరెస్టులు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తిరుపతి పట్టణంలో వైసీపీ బోగస్ ఓట్లను ప్రశ్నించిన టీడీపీ నాయకుడు, పోలింగ్ ఏజెంట్ పులిగోరు మురళి ని అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన ఘటనలపై ఆధారాలను లేఖతో పాటు పంపుతున్నట్లు వివరించారు.