Sugali Preethi Case: సీబీఐకు అప్పగించినా కేసు దర్యాప్తు ముందుకు వెళ్లకపోవడంపై పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
Sugali Preethi Case: సీబీఐ దర్యాప్తుకు అప్పగించమని జీవో ఇచ్చిన సుగాలి ప్రీతి కేసు దర్యాప్తు ముందుకు తీసుకు వెళ్లకపోవడంపై ప్రీతి తల్లి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ఖు ఫిర్యాదు చేశారు.
Sugali Preethi Case: సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చినా కేసు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లలేదని బాధితులు పవన్ కళ్యాణ్‌ను ఆశ్రయించారు. సోమవారం సాయంత్రం పవన్ కళ్యాణ్‌ను కలసి సుగాలీ ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి వినతి పత్రం అందించారు.
‘మా అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’ అని సుగాలీ ప్రీతి శ్రీమతి పార్వతి కన్నీటి పర్యంతమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు వినతి పత్రం అందించారు.
మంగళవారం సాయంత్రం మంగళగిరిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తన కుటుంబంతో కలసి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు. ఈ కేసు విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు.
పవన్ కళ్యాణ్ స్పందిస్తూ సుగాలీ ప్రీతి కేసు విషయంలో ఆమె తల్లి శ్రీమతి పార్వతి పోరాడుతూనే ఉన్నారనీ, ఈ విషయంపై పోలీసు అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.