Jhonny Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు
Jhonny Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది.యూపీకి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అనంతరం ఘటన జరిగిన నార్సింగి పిఎస్‌కు బదిలీ చేశారు. జానీ మాస్టర్ దాడికి సంబంధించిన ఆధారాలను బాధితురాలు పోలీసులకు అందించారు.
Jhonny Master: ప్రముఖ టాలీవుడ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని, ఔట్ డోర్ షూటింగ్‌లలో అత్యాచాారానికి పాల్పడ్డాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో జరిగిన షూటింగ్‌లో తనపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
వివిధ నగరాల్లో అవుట్‌డోర్ షూటింగ్‌లు జరిగినపుడు జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేసింది. నార్సింగిలోని నివాసంలో కూడా తనను వేధించారని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుతో జానీ మాస్టర్‌పై 376, 506, 323 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జానీ మాస్టర్‌కు గతంలో కూడా నేర చరిత్ర ఉందని బాధితురాలు ఆరోపించారు.
అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌గా పనిచేస్తున్న యూపీకి చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదులో జానీ మాస్టర్ అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడటంతో పాటు తనను బెదిరించి, దాడికి పాల్పడ్డారని ఆరోపించింది.
ఈ ఘటనలో రాయదుర్గంలో మొదట జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నార్సింగిలోని ఇంటిలో దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించడంతో కేసును నార్సింగికి బదిలీ చేశారు. . హైదరాబాద్, చెన్నై, ముంబైలలో జరిగిన ఔట్ డోర్ షూటింగ్‌లలో తనను వేధించినట్లు బాధితురాలు ఆరోపించింది.
టాలీవుడ్ డ్యాన్సర్ యూనియన్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనకు అవకాశాలు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది.
2019 నుంచి బాధితురాలు జానీ మాస్టర్ వద్ద కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. తనను దూషించడం, వేధించడం, గాయపరచడం వంటివి చేసేవాడని బాధితురాలి ఫిర్యాదులో ఆరోపించారు. తనతో పాటు మరికొందరిని కూడా జానీ మాస్టర్ లైంగికంగా వేధించారని బాధితురాలు ఆరోపించింది. 2015లో కాలేజీ మహిళపై దాడి చేశారనే అభియోగాలను జానీ మాస్టర్ ఎదుర్కొన్నారు. 2019లో మేడ్చల్ కోర్టు ఆర్నెల్ల జైలు శిక్షను విధించింది.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఏపీలో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు.