PM Vidyalakshmi : విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫ‌ర్‌, పీఎం విద్యాలక్ష్మి ప‌థ‌కం ద్వారా రూ.10 ల‌క్షల రుణం-pm vidya lakshmi scheme 10 lakh rupees education loan to students central cabinet approved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pm Vidyalakshmi : విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫ‌ర్‌, పీఎం విద్యాలక్ష్మి ప‌థ‌కం ద్వారా రూ.10 ల‌క్షల రుణం

PM Vidyalakshmi : విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫ‌ర్‌, పీఎం విద్యాలక్ష్మి ప‌థ‌కం ద్వారా రూ.10 ల‌క్షల రుణం

HT Telugu Desk HT Telugu
Nov 10, 2024 07:45 PM IST

PM Vidyalakshmi : విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యాసంస్థల్లో చేరే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం చేసేందుకు పీఎం విద్యాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులకు తక్కువ వడ్డీకి విద్యా రుణాలు అందించనున్నారు.

విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫ‌ర్‌, పీఎం విద్యాలక్ష్మి ప‌థ‌కం ద్వారా రూ.10 ల‌క్షల రుణం
విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫ‌ర్‌, పీఎం విద్యాలక్ష్మి ప‌థ‌కం ద్వారా రూ.10 ల‌క్షల రుణం

ఉన్నత విద్యా సంస్థల్లో చేరే ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేందుకు స‌రికొత్త ప‌థ‌కాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 'పీఎం విద్యాలక్ష్మి' పథకం పేరుతో విద్యార్థుల‌కు కేంద్ర ప్రభుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. ఏకంగా రూ.10 ల‌క్షల వ‌ర‌కు రుణం స‌దుపాయాన్ని క‌ల్పింది. న‌వంబ‌ర్ 6న జ‌రిగిన కేంద్ర మంత్రి వ‌ర్గం ఈ ప‌థ‌కానికి ఆమోదం తెలిపింది. స‌ర‌ళ‌మైన‌, పార‌ద‌ర్శక‌మైన పూర్తిస్థాయి డిజిట‌ల్ వ్యవ‌స్థ ద్వారా ఈ ప‌థ‌కాన్ని నిర్వహిస్తారు.

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

విద్యార్థులు విద్యాల‌క్ష్మి పోర్టల్‌ https://www.vidyalakshmi.co.in/Students/index కి వెళ్లాలి. విద్యాలక్ష్మి పోర్టల్ విద్యార్థులకు బ్యాంకులు అందించే వివిధ రుణ పథకాల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి, విద్యా రుణాల కోసం దరఖాస్తులను చేయడానికి సింగిల్ విండోను అందిస్తుంది. విద్యా లక్ష్మి పోర్టల్‌లో విద్యా రుణం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలను న‌మోదు చేయాలి.

ముఖ్యమైన సూచనలు

దయచేసి నమోదు చేసిన నమోదు వివరాలు సరైనవని నిర్ధారించుకోవాలి. అవసరమైన ఫార్మెట్‌లో పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.

విద్యాలక్ష్మి పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి మార్గదర్శకాలు

1. పేరు- 10వ తరగతి మార్క్‌షీట్ లేదా మీ లోన్ అప్లికేషన్‌తో జత చేసిన మార్క్‌షీట్ ప్రకారం విద్యార్థి పేరును నమోదు చేయండి.

2. మొబైల్ నంబర్- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. విద్యార్థి తల్లిదండ్రులు/సంరక్షకుల మొబైల్ నంబర్‌ను అందించవ‌చ్చు.

3. ఈ-మెయిల్ ఐడీ- చెల్లుబాటు అయ్యే ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. ఈ-మెయిల్ ఐడీ మార్చడానికి అనుమతించబడదు. ఈ- ఇమెయిల్ ఐడీకి అవసరమైన అన్ని స‌మాచారాలు పంపిస్తారు.

ఈ రుణాలకి ఎవ‌రు అర్హులు?

ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన వారు ఆయా సంస్థల్లో చదువుకునేందుకు 'విద్యా లక్ష్మి పథకం' ద్వారా రుణాలు పొందవచ్చు. పీఎం విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు నేరుగా రుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రుణాలకు కొలేటరల్, గ్యారంటర్ అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విభాగాల వారీగా, డొమైన్ల వారీగా 100 లోపు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు సాధించిన విద్యా సంస్థలూ, 101-200 వ‌ర‌కు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు సాధించిన రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో న‌డిచే విద్యా సంస్థలు, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో న‌డిచే అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో చ‌దివే విద్యార్థులు ఈ ప‌థ‌కానికి అర్హులు.

అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉన్నత విద్యా సంస్థ (క్యూహెచ్ఐఈలు)ల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ట్యూష‌న్ ఫీజు, కోర్సుకు సంబంధించిన ఇత‌ర ఖ‌ర్చులకు అయ్యే పూర్తి మొత్తాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి హామీ లేకుండా రుణం పొందేందుకు అర్హులు. దేశవ్యాప్తంగా 860 ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ హామీతో రూ.7.50 లక్షల వరకూ రుణం పొందవచ్చు. రుణంలో 75 శాతం బ్యాంకులకు కేంద్రం గ్యారంటీ ఇస్తుంది. ఈ పథకం కింద ఏటా గరిష్టంగా 22 లక్షల మంది విద్యార్థులు ఇస్తారు.

దీనికి అద‌నంగా కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉండి, ఇత‌ర ప్రభుత్వ ఉప‌కార వేత‌నాలు, వ‌డ్డీ రాయితీ ప‌థ‌కాలు పొందేందుకు అర్హత లేని వారికి మారటోరియం కాల వ్యవ‌ధిలో రూ.10 లక్షల వరకు 3 శాత వడ్డీ రాయితీ కల్పిస్తారు. ప్రతి ఏటా ల‌క్ష మందికి ఈ వ‌డ్డీ రాయితీ అందిస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో టెక్నిక‌ల్‌, ప్రొఫెష‌న‌ల్ కోర్సుల్లో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. 2024-25 నుంచి 2030-31 వ‌ర‌కు రూ.3,600 కోట్లు కేటాయింపుల ద్వారా ఏడు ల‌క్షల మంది కొత్త విద్యార్థుల‌కు ఈ వ‌డ్డీ రాయితీ ద్వారా ల‌బ్ధి చేకూరుతుంది. స‌రళమైన విధానంలో అన్ని బ్యాంకులు ఉపయోగించేలా ఉన్నత విద్యా శాఖ రూపొందించిన ‘పీఎం-విద్యాలక్ష్మి’ ఏకీకృత పోర్టల్ ద్వారా విద్యారుణాలు, వడ్డీ రాయితీలకు దరఖాస్తు చేసుకోవాలి. వడ్డీ రాయితీ చెల్లింపులు- ఈ-ఓచర్, సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) వాలెట్ల ద్వారా చేస్తారు.

ఉన్నత విద్యా విభాగం అమలు చేస్తున్న పీఎం-యూఎస్‌పీలో అంతర్భాగమైన కేంద్ర ప్రభుత్వ వడ్డీ రాయితీ (సీఎస్ఐఎస్), విద్యా రుణాలకు క్రెడిట్ గ్యారంటీ ఫండ్ స్కీమ్ (సీజీఎఫ్ఎస్ఈఎల్) పథకాలకు అనుబంధ పథకంగా పనిచేస్తుంది. కుటుంబ వార్షికాదాయం 4.5 లక్షల వరకు ఉండి గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు పీఎం-యూఎస్‌పీ, సీఎస్ఐఎస్ ద్వారా రూ.10 లక్షల వరకు ఉన్న విద్యారుణాలకు మారటోరియం కాల వ్యవధిలో పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది. తద్వారా పీఎం విద్యాలక్ష్మి, పీఎం - యూఎస్‌పీ సంయుక్తంగా అర్హులైన విద్యార్థులందరికీ నాణ్యతా ప్రమాణాలు పాటించే, గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశాన్ని అందిస్తాయి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు. హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner