Minister Pawan Kalyan: పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
Minister Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Minister Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టారు.విజయవాడలోని ఇరిగేషన్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రభుత్వంలో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టారు.
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఘన విజయం సాధించారు. కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. మంత్రి వర్గ విస్తరణలో ఆయన కోరుకున్న స్థానాలతో పాటు డిప్యూటీ సిఎం పదవిని కేటాయించారు. బుధవారం విజయవాడలో బాధ్యతలు చేపట్టారు. పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్ కుమార్‌తో పాటు ఇతర అధికారులు ఆయనకు స్వాగతం పలికారు.
బాధ్యతలు చేపట్టడానికి ముందు విజయవాడ ఇంద్రకీలాద్రికి చెందిన వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇరిగేషన్ క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ‌్‌కు సాయుధ పోలీసులు గౌరవ వందనం పలికారు.