(1 / 5)
ఏడు కొండలపై ప్రకృతి అందాలను చూస్తే భూలోక స్వర్గం అనాల్సిందే. ఆధ్యాత్మికత్వంతో పాటు.. ఆహ్లాదం మనసును కట్టిపడేస్తోంది. తుపాన్ ఎఫెక్ట్ తో తాజాగా వర్షాలు.. మరోవైపు మంచు తుంపరలతో తిరుమల అందం రెట్టింపు అయ్యింది.
(twitter)
(2 / 5)
వర్షాల దాటికి జలపాతాలు పొంగుతున్నాయి. కపీలతీర్థం వద్ద జలపాతం పరవళ్లు తొక్కుతోంది. మరోవైపు శ్రీవారి భక్తులు ప్రకృతి అందాలకు ఫిదా అయిపోతున్నారు.
(twitter)
(3 / 5)
నిత్యం ఆహ్లాదంగానే కనిపిస్తుంది తిరుమల. ఏడుకొండలపై ఉన్న శ్రీవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తుంటారు భక్తులు. వర్షాలతో తిరుమల గిరులు మరింత ఆహ్లాదాన్ని సంతరించుకున్నాయి.
(svbc)(4 / 5)
తిరుమలలోని ఆకాశగంగా, పాపనాశం, గోగర్భం డ్యాం, కుమార ధర , పసుపుధార జలాశయాలు జలకళతో ఉట్టి పడుతున్నాయి.
(5 / 5)
ఎంత్తైన కొండచరియల నుండి ఎగసిఎగసి పడుతున్న ఈ జలపాతాలను తిలకించడానికి భక్తులు ఎంతో ఉత్సుకతను ప్రదర్శిస్తున్నారు. పచ్చని చీర కట్టినట్టు అందాలు మరో లోకానికి తీసుకెళ్లాలా చేస్తున్నాయి.
(svbc)ఇతర గ్యాలరీలు