Kanipaakam : కాణిపాకంలో ఘనంగా మహాకుంభాభిషేకం-newly constructed kanipakam temple inaugurated ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Newly Constructed Kanipakam Temple Inaugurated

Kanipaakam : కాణిపాకంలో ఘనంగా మహాకుంభాభిషేకం

HT Telugu Desk HT Telugu
Aug 21, 2022 12:13 PM IST

కాణిపాకంలో ఈ నెల 21న స్వయం భు శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి చతుర్వేద హవన సహిత మహా కుంభాభిషేకం నిర్వహించారు. రూ.10కోట్లతో పునర్నిర్మించిన ఆలయాన్ని భక్తుల దర్శనాల కోసం సిద్ధం చేశారు.

భక్తుల దర్శనాలకు సిద్ధమైన కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయం
భక్తుల దర్శనాలకు సిద్ధమైన కాణిపాకం వరసిద్ది వినాయక ఆలయం

వెయ్యేళ్ల చరిత్ర కలిగిన స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారి మహా కుంభాభిషేకం కాణిపాకంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డితో పాటు రోజా దంపతులు, చిత్తూరు జిల్లా నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆదివా రం శాాస్త్రోక్తంగా చతుర్వేదహవన సహిత మహా కుంభాభిషేకం నిర్వహించారు. స్వస్తి శ్రీ చంద్రమాన శుభ కృత్ నామ సంవత్సర శ్రావణ బహుళ దశమి మృగశిరా నక్షత్ర యుక్త శుభ కన్యా లగ్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు విమాన గోపురం మరియు ధ్వజస్తంభములకు మహా కుంభాభిషేకం నిర్వహించారు.

మహా కుంభాభిషేకం లో భాగంగా ఉ. 6 గం.ల నుండి చతుర్థ కాల హోమము, మహా పూర్ణాహుతి, కలశోద్వాసన,ఉ.8 గం.ల నుండి 8.30 గం.ల లోపు రాజ గోపురం, పశ్చిమ ద్వార గోపురం, స్వామి వారి విమాన గోపురం,నూతన ధ్వ జస్తంభములకు "మ హా కుంభాభిషేకం". ఉ.8:30 నుండి 9 గంటలకు స్వయం భు శ్రీ వరసిద్ధి వినా యక స్వామి వారికి కుంభాభిషేకం, తీర్థ ప్రసాద వినియోగం, యజమానోత్సవం నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుండి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి "తిరు కళ్యాణం" మరియు గ్రామోత్సవం నిర్వహిస్తారు. మహా కుంభాభిషే కము అనంతరం మ.2 గం.ల నుండి స్వామి వారి మూల విరాట్ దర్శనం కల్పించబడుతుంది.

ఆలయ పునర్నిర్మా ణం కోసం దాతలు రూ.10 కోట్లు విరాళం ఇచ్చారు. దీనితో పాటు రూ.5 కోట్లతో నూతన లడ్డు పోటు మరియు పడి తరం స్టోరు నిర్మాణం చేపట్టారు. సుమారు రూ. 12 కోట్లతో వినాయక సదన్ వసతి గదుల లో 2 మరియు 3 వ అం తస్తుల నిర్మాణం చేపట్టారు. సుమారు రూ.9 కోట్లతో భక్తుల సౌక ర్యార్థం నూతన ఏసీ మరియు నాన్ ఏసీ కళ్యాణ మండపంలో నిర్మాణానికి ప్రతిపాదించారు. సుమారు రూ. 20 కోట్లతో నూతన క్యూ కాంప్లెక్స్ భవనానికి అంచనాలు సిద్ధం చేశారు. కాణిపాకంలో సుమారు రూ. 14 కోట్లతో నూతన బస్టాండు మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణమునకు అంచనాలు రూపొందించారు. సుమారు రూ. 4 కోట్లతో 100 అడుగుల రోడ్డు మరియు స్వాగతం ఆర్చి గేట్ నిర్మించనున్నారు.

భక్తులకు సౌకర్యాలు….

వివిధ రాష్ట్రాల నుం డి వివిధ ప్రాంతాల నుంచి ఇచ్చే భక్తుల కు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించేందుకు జిల్లా యంత్రాంగం మరి యు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. క్యూలైన్లో భక్తులు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, మజ్జిగ అందజేయడంతో పాటు భక్తుల రద్దీ దృష్టి లో ఉంచుకొని అదనంగా భక్తుల సేదతీరేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయడం జరుగు తోంది .శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దర్శనా నికి వచ్చే భక్తులకు దాదాపు 30 వేల మందికి పైగా అన్న దానం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఉదయము అల్పాహారం,మధ్యా హ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు చేయడంలో భాగం గా దేవస్థానం అన్న దాన భవనం తో పాటు విగ్నేశ్వర కళ్యాణ మండపం లో కూడా ఏర్పాట్లు చేశారు..

మహా కుంభాభిషేకం సందర్భంగా భక్తుల రద్దీ ని దృష్టి లో ఉంచు కొని 25 వేలు చిన్న లడ్డులు(80గ్రాములు)వీటి ధర ఒక్కొ క్కటి రూ.15/-, 400 గ్రాముల లడ్డులను ఐదు వేలు,వీటి ధర ఒక్కొక్కటి రూ.75 /- వడ 2 వేలు, వీటి ధర ఒక్కొక్కటి రూ.10/- ప్రసాదాల కౌంటర్ నందు అందుబాటు లో ఉంచారు.

IPL_Entry_Point

టాపిక్