Lineman Ramaiah : విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు లైన్ మెన్ రామయ్య సాహసం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ కితాబు-minister gottipati ravi kumar admirable linemen ramaiah crossed canal on wires to restore power supply ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lineman Ramaiah : విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు లైన్ మెన్ రామయ్య సాహసం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ కితాబు

Lineman Ramaiah : విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు లైన్ మెన్ రామయ్య సాహసం, మంత్రి గొట్టిపాటి రవికుమార్ కితాబు

Bandaru Satyaprasad HT Telugu
Jul 28, 2024 05:58 PM IST

Lineman Ramaiah : వరద ఉద్ధృతిని లెక్క చేయకుండా తీగలపై వాగును దాటి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు లైన్ మెన్ రామయ్య. ఈ విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ లైన్ మెన్ ను అభినందించారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు లైన్ మెన్ రామయ్య సాహసం, మంత్రి గొట్టిపాటి కితాబు
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు లైన్ మెన్ రామయ్య సాహసం, మంత్రి గొట్టిపాటి కితాబు

Lineman Ramaiah : సంక్షోభం నుంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. ఇందుకు లైన్ మెన్ రామయ్య చేసిన సాహసమే ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన కొనియాడారు. ప్రజావసరాలను తీర్చడంలో తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించామని చెప్పారు. భారీ వర్షాలకు అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి విద్యుత్ నిలిచిపోయింది. అక్కడి ప్రజలు బాహ్య ప్రపంచంతో ప్రజాసంబంధాలను కోల్పోయారు.

ఈ తరుణంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పని చేస్తున్న లైన్ మెన్ కూర రామయ్య వరద ఉద్ధృతిని కూడా లెక్క చేయకుండా... విద్యుత్ పునరుద్దరణే లక్ష్యంగా తీగలపై నడుచుకుంటూ వాగు దాటి విద్యుత్ సేవలను అందించారు. విధి నిర్వహణలో రామయ్య చూపిన సాహసం, తెగువ అభినందనీయమని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ కొనియాడారు. ఇది ఎంతో మంది ఉద్యోగులకు ఆదర్శమని, మరెంతో మందిలో చైతన్యం నింపుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని అన్నారు. కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం