Mangalagiri AIIMS : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ-mangalagiri aiims non teaching staff 93 posts application start on october 8th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mangalagiri Aiims : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

Mangalagiri AIIMS : మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Oct 09, 2024 09:39 PM IST

Mangalagiri AIIMS Jobs : మంగళగిరి ఎయిమ్స్ లో 93 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా...ఈ నెల 28 లోపు అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ ఎ, డి, సి విభాగాల్లో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ
మంగ‌ళ‌గిరి ఎయిమ్స్‌లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తు దాఖ‌లకు అక్టోబర్ 28 ఆఖ‌రు తేదీ

మంగ‌ళ‌గిరి ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఏఐఐఎంఎస్‌)లో 93 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అక్టోబ‌ర్ 28 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో గ్రూప్ ఎ, డి, సి విభాగాల్లో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తారు.

ద‌ర‌ఖాస్తులు

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోస్టుల‌కు హార్డ్ కాపీలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు అక్టోబ‌ర్ 8 నుంచి ప్రారంభం అయ్యాయి. అక్టోబ‌ర్‌ 28తో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు ముగిస్తాయి. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aiimsmg.totalrecruitment.in/Index/institute_index/ins/RECINS001

పోస్టులు

7వ పే క‌మిష‌న్‌లో లెవ‌ల్ -10లో గ్రూప్ ఏ పోస్టులు మెడిక‌ల్ ఆఫీస‌ర్ (ఆయూష్‌) 2 (ఆయూర్వేద‌, హోమియోప‌తి), మెడిక‌ల్ ఫిజిసిస్ట్ (రేడియేష‌న్ థెర‌పీ) 1, మెడిక‌ల్ ఫిజిసిస్ట్ (న్యూక్లియ‌ర్ మెడిసిన్‌) 1, క్లినిక‌ల్ సైకాల‌జిస్ట్ 1, చైల్డ్ సైకాల‌జిస్ట్ 1 భ‌ర్తీ చేస్తారు. లెవ‌ల్ -7లో గ్రూప్ బీ పోస్టులు ప్రోగ్రామ‌ర్ 1, లెవ‌ల్ -6 స్టోర్ కీప‌ర్ 1, జూనియ‌ర్ ఇంజినీర్ -1, లైబ్రరీ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ -1, మెడిక‌ల్ సోష‌ల్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ గ్రేడ్‌- II 2, పెర్ఫ్యూషనిస్ట్ 1, అసిస్టెంట్ డైటీషియన్ 2, టెక్నీషియ‌న్ (ల్యాబ్) 16, టెక్నీషియ‌న్ (ఓటీ) 5, ఎంబ్రియాలజిస్ట్ 1, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ 1, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ 1 భ‌ర్తీ చేస్తారు.

లెవ‌ల్- 5లో గ్రూప్ సీ పోస్టులు డెంటల్ టెక్నీషియన్ (హైజీనిస్ట్) 1, , న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ 1, లెవ‌ల్- 4 మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ 2, స్టెనోగ్రాఫ‌ర్ 1, లెవ‌ల్ -3 లైబ్ర‌రీ అటెండెంట్ గ్రేడ్‌-II 1, లెవ‌ల్‌-2 లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ 5, ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్‌-II 1, లెవ‌ల్ -1 హాస్పిట‌ల్ అటెండెంట్ గ్రేడ్-III (న‌ర్సింగ్ ఆర్డర్లీ) 40, మ‌ర్చూరీ అటెండెంట్ 2 భ‌ర్తీ చేస్తారు.

రిజ‌ర్వేష‌న్లు

మొత్తం 93 పోస్టుల్లో 60 జ‌న‌ర‌ల్ పోస్టులు కాగా, 16 ఓబీసీ, 8 ఎస్సీ, 4 ఎస్టీ, 5 ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీల్లో ఉన్నాయి. వ‌యో ప‌రిమితి ఒక్కో విభాగానికి సంబంధించిన పోస్టుల‌కు ఒక్కో ర‌కంగా ఉంది. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీల‌కు ఐదేళ్లు, విక‌లాంగుల‌కు ప‌దేళ్లు, ఎక్స్ స‌ర్వీస్ కేట‌గిరీ వాళ్ల‌కు మూడేళ్లు వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది.

అప్లికేష‌న్ ఫీజు

జ‌న‌ర‌ల్, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్ కేట‌గిరీ వాళ్లకు రూ. 1,500 (అప్లికేష‌న్ ఫీజు 1,400, ప్రొసెసింగ్ ఫీజు రూ.100), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ స‌ర్వీస్ కేట‌గిరీ వాళ్లకు రూ. రూ.1,000 (అప్లికేష‌న్ ఫీజు 900, ప్రొసెసింగ్ ఫీజు రూ.100) ఉంటుంది. దివ్యాంగుల‌కు ఎటువంటి ఫీజు ఉండ‌దు.

ఎంపిక విధానం...విద్యా అర్హత‌లు

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. గ్రూప్-ఏ పోస్టుల‌కు సంబంధించి కేవ‌లం ఇంట‌ర్యూలు ద్వారా ఎంపిక చేస్తారు. అలాగే గ్రూప్ బీ, సీ పోస్టుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు. విద్యా అర్హత‌లు ఒక్కో విభాగ పోస్టుకు ఒక్కో ర‌కంగా ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తి నుంచి ఇంట‌ర్మీడియేట్‌, డిగ్రీ, పీజీ, ఇంజ‌నీరింగ్ త‌దిత‌ర డిగ్రీలు పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింకు https://www.aiimsmangalagiri.edu.in/wp-content/uploads/2024/10/ADVERTISEMENT-FOR-RECRUITMENT-TO-VARIOUS-NON-FACULTY-POSTS-GROUP-A-B-C-ON-DIRECT-RECRUITMENT-BASIS.pdf ను సంప్రదించండి.

ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు ఇవి అవ‌స‌రం

1. ఈ మెయిల్ ఐడీ

2. స్కాన్ చేసిన పాస్‌పోర్టు సైజ్ ఫోటో (జేపీజీ ఫార్మెట్‌)

3. స్కాన్ చేసిన సంత‌కం (జేపీజీ ఫార్మెట్‌)

4. పుట్టిన తేదీ ధ్రువీకర‌ణ ప‌త్రం, ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా

5. విద్యా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

6. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగు అభ్యర్థులు దివ్యాంగు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

పరీక్ష కేంద్రాలు

విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌, చెన్నై, బెంగ‌ళూరు, తిరువ‌నంత‌పురం, భువ‌నేశ్వర్, ముంబాయి, క‌ల‌క‌త్తా, భోపాల్‌, జైపూర్‌, అహ్మ‌దాబాద్‌, ల‌క్నో, రాయ‌పూర్‌, న్యూఢిల్లీ, పాట్నా, గౌహ‌తి.

జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం