ANGRAU Jobs : ఎన్.రంగా వర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ భర్తీ, మార్చి 5న వాక్-ఇన్-ఇంటర్య్వూ-mahanandi news in telugu angrau physical director post recruitment walk in interview ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Angrau Jobs : ఎన్.రంగా వర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ భర్తీ, మార్చి 5న వాక్-ఇన్-ఇంటర్య్వూ

ANGRAU Jobs : ఎన్.రంగా వర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ భర్తీ, మార్చి 5న వాక్-ఇన్-ఇంటర్య్వూ

Bandaru Satyaprasad HT Telugu
Feb 27, 2024 10:28 PM IST

ANGRAU Jobs : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు మార్చి 5న వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.

ఎన్.రంగా వర్సిటీలో ఉద్యోగాలు
ఎన్.రంగా వర్సిటీలో ఉద్యోగాలు

ANGRAU Jobs : ఆచార్య ఎన్.జి. రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టు భర్తీకి వాక్-ఇన్-ఇంటర్వ్యూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చని సూచించారు. అభ్యర్థులు M.P.Ed/ PhD (ఫిజికల్ ఎడ్యుకేషన్) అర్హత కలిగి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పీహెచ్.డి (ఫిజికల్ ఎడ్యుకేషన్) అభ్యర్థికి నెలకు రూ.38 వేలు చెల్లించనున్నారు. ఎంపీ.ఎడ్ హోల్డర్లకు రూ.33 వేలు చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 5న ఉదయం 11 గంటలకు మహానంది అగ్రికల్చరల్ కాలేజీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు.

yearly horoscope entry point

ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు

విజయవాడలోని ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(APMDC) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. వీటిని రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 13వ తేదీని అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించారు. https://apmdc.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయవచ్చు.

ముఖ్య వివరాలు:

  1. రిక్రూట్ మెంట్ ప్రకటన -ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
  2. ఉద్యోగ ఖాళీలు - 06
  3. వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (మెటాలిఫరస్) - 03 పోస్టులు, మేనేజ్‌మెంట్ ట్రైనీ (సర్వే) (కోల్‌) - 03 పోస్టులు.
  4. అర్హతలు - డిగ్రీ/ డిప్లొమా (మైనింగ్/ మైన్ సర్వే) లేదా డిగ్రీ (సైన్స్‌), మైన్ సర్వేయర్స్ సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ కలిగి ఉండాలి.
  5. వయోపరిమితి - 18 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి.
  6. దరఖాస్తులు - ఆన్ లైన్
  7. ఎంపిక విధానం - కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  8. 150 మార్కుల(Aptitude & Reasoning– 10%- General Knowledge questions –~20% , Subject related questions –~70%)కు ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
  9. పరీక్షా సమయం - 2 గంటల 30 నిమిషాలు.
  10. ఎగ్జామ్ ఫీజు- బీసీ/ ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ కేటగిరీకి రూ.500. ఇతర కేటగిరీలకు రూ.1000 ఉంది.
  11. ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు తేదీ - మార్చి 14,2024.
  12. అధికారిక వెబ్ సైట్ - https://apmdc.ap.gov.in/i

Whats_app_banner