Madanapalle : ప్రమాదమా? కుట్రపూరితమా? మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై అనుమానాలు- విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం-madanapalle sub collector office fire accident cm chandrababu serious orders inquiry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Madanapalle : ప్రమాదమా? కుట్రపూరితమా? మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై అనుమానాలు- విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

Madanapalle : ప్రమాదమా? కుట్రపూరితమా? మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై అనుమానాలు- విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

Bandaru Satyaprasad HT Telugu
Jul 22, 2024 02:29 PM IST

Madanapalle Sub Collectorate Fire Accident : మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్ని ప్రమాదం కలకలం రేపుతోంది. ఇది ప్రమాదమా? కుట్రపూరితమా? విచారణ చేయాలని సీఎం చంద్రబాబు డీజీపీని ఆదేశించారు.

ప్రమాదమా? కుట్రపూరితమా? మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై అనుమానాలు
ప్రమాదమా? కుట్రపూరితమా? మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఘటనపై అనుమానాలు

Madanapalle Sub Collectorate Fire Accident : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒక్కసారి మంటల చెలరేగి సబ్ కలెక్టరేట్ లోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు, సామాగ్రి, పలు కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ఆదివారం రాత్రి వరకు ఓ ఉద్యోగి సబ్ కలెక్టరేట్ లో ఉండడం, కీలక దస్త్రాలు కాలిపోవడంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనపై అత్యవసర విచారణకు డీజీపీకి ఆదేశించారు. ఘటనాస్థలికి హెలికాప్టర్‌లో వెళ్లాలని డీజీపీ ద్వారకా తిరుమలరావుకు సీఎం ఆదేశించారు. డీజీపీ, సీఐడీ చీఫ్‌ మదనపల్లెకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. కొత్త సబ్‌ కలెక్టర్‌ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం, కీలక దస్త్రాలు కాలిపోడవంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదమా? ఎవరైనా కుట్రపూరితంగా చేశారా? అనే కోణంలో విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. భూముల అవకతవకలు బయటపడతాయనే అనుమానంతో దస్త్రాలు తగలబెట్టారని స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు.

yearly horoscope entry point

ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే గౌతమ్‌ అనే ఉద్యోగి ఆదివారం రాత్రి 12 గంటల వరకు ఆఫీసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి సమయంలో అతడు అక్కడి ఎందుకు వచ్చాడు, అతడు వెళ్లిన కాసేపటికే అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం... అగ్ని ప్రమాదంలో రెవెన్యూ్ రికార్డులు దగ్ధమవ్వడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ అనే ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేస్తున్నారు. ఘటనాస్థలిని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, ఏఎస్పీ రాజ్‌కుమార్‌ పరిశీలించి, విచారణ చేపట్టారు.

పుంగనూరు, మదనపల్లె అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర

వైసీపీకి చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల భూఆక్రమణల రికార్డులు మాయం చేసేందుకు అగ్ని ప్రమాదం సృష్టించారని టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ పాలనలో భూఆక్రమణలు జరిగాయని, కొత్త ప్రభుత్వంలో అవి బయటపడతాయనే భయంతో కార్యాలయానికి నిప్పుపెట్టారని ఆరోపణలు చేస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీజీపీ, సీఐడీ చీఫ్ పరిశీలించడానికి వస్తుండడంతో...భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదంపై నిజాలు నిగ్గుతేల్చాలని మదనపల్లె సబ్ కలెక్టరేట్ ముందు సీపీఐ నేతలు ధర్నాకు దిగారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంప్యూటర్లు, కీలక ఫైళ్ల దహనానికి కారణమైన ఉద్యోగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదం కుట్ర వెనక పెద్దిరెడ్డి కుటుంబం హస్తం ఉందంటూ సీపీఐ నేతలు ఆరోపించారు. భూఅక్రమాలు బయటపడతాయని, రికార్డులు ఉన్న గదులకు నిప్పుపెట్టారన్నారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఆర్డీవో, ఇతర అధికారులను విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పుంగనూరు, మదనపల్లె ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులు దగ్ధమవ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందని సీపీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం