Kothavalasa Train Derails : కొత్తవలస వద్ద పట్టాలు తప్పిన భవానీపట్న ప్యాసింజర్-kothavalasa news in telugu bhawanipatna passenger train derails passengers not injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kothavalasa Train Derails : కొత్తవలస వద్ద పట్టాలు తప్పిన భవానీపట్న ప్యాసింజర్

Kothavalasa Train Derails : కొత్తవలస వద్ద పట్టాలు తప్పిన భవానీపట్న ప్యాసింజర్

Bandaru Satyaprasad HT Telugu
Mar 10, 2024 09:46 PM IST

Kothavalasa Train Derails : ఏపీలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి భవానీపట్న వెళ్తున్న ప్యాసింజర్ రైలు కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. తక్కువ స్పీడ్ తో వెళ్తుండడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

పట్టాలు తప్పిన భవానీపట్న ప్యాసింజర్
పట్టాలు తప్పిన భవానీపట్న ప్యాసింజర్

Kothavalasa Train Derails : భవానీపట్న స్పెషల్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు(Bhavanipatna Train derails) తప్పింది. విజయనంగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ (Kothavalasa Station)దాటిన కొన్ని నిమిషాల్లో రైలు పట్టాలు తప్పింది. అయితే రైలు తక్కువ స్పీడ్ లో వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం నుంచి భవానీపట్న వెళ్లే ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస వద్ద పట్టాలు(Train Accident) తప్పింది. మెయిన్‌ లైన్ నుంచి మిడిల్‌ లైన్‌కు వెళ్తున్న సమయంలో ఇంజిన్‌ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి రైల్వే సిబ్బంది కొత్తవలసకు వెళ్లారు. ప్రస్తుతం ఇంజిన్‌కు మరమ్మతులు చేస్తున్నారు.

పట్టాలు తప్పిన ఇంజిన్, రెండు బోగీలు

ప్రాథమిక సమాచారం ప్రకారం విశాఖపట్నం నుంచి భవానీపట్న వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఒకవైపు, మరోవైపు రైలు ఇంజిన్ పక్కకు వాలాయి. రైలు కొత్తవలస రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే రైలు నెమ్మదిగా నడపడం, లోకో పైలట్ అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులు చేపట్టారు. 2023లో విజయనగరంలో విశాఖపట్నం-రాయగడ రైలు(Visakha Rayagada Train Accident), పలాస రైలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు మరణించిన సంగతి తెలిసిందే.

Whats_app_banner