తెలుగు న్యూస్ / ఫోటో /
Pulasa Fish : గోదారోళ్ల ఆతిథ్యమా మజాకా! ఖరీదైన పులస చేపతో విందు
- Pulasa Fish : కోనసీమ జిల్లాల్లో ఖరీదైన పులస చేపతో ఏకంగా విందే పెట్టారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుస్తలమ్మి అయినా సరే పులస చేప తినాలనే నానుడి ఉంది. ఆ పులస చేప అంత ఖరీదైనది. అలాగే రుచి కూడా ఖరీదుకు తగ్గట్టుగానే ఉంటుంది.
- Pulasa Fish : కోనసీమ జిల్లాల్లో ఖరీదైన పులస చేపతో ఏకంగా విందే పెట్టారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుస్తలమ్మి అయినా సరే పులస చేప తినాలనే నానుడి ఉంది. ఆ పులస చేప అంత ఖరీదైనది. అలాగే రుచి కూడా ఖరీదుకు తగ్గట్టుగానే ఉంటుంది.
(1 / 6)
గోదావరి జిల్లాలంటేనే పచ్చని పంట పొలాలు, గోదావరి నది, గోదారోళ్ల ఎటకారం గుర్తుకొస్తాయి. అయితే వీటితో పాటు మరో ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. అదేంటంటే వారి ఆతిథ్యం. గోదారోళ్ల ఆతిథ్యం బహు అమోఘంగా ఉంటుంది. గోదారోళ్లు పెట్టే భోజనంపై అనేక వ్యాఖ్యానాలు, సామెతలు ఉన్నాయి. భోజనం పెట్టడంలో ఎక్కడా వెనకడుగు వేయరని అంటుంటారు.
(2 / 6)
గోదారోళ్లు భోజనం పెట్టి చంపేస్తారనే నానుడి ఉంది. ఇళ్లలోని భోజనమే కాదు, హోటళ్లో కూడా భోజనం అలాగే ఉంటుంది. భోజనం చేయడానికి హోటల్‌కి వెళ్తే పచ్చళ్లు, నాన్ వెజ్ పచ్చళ్లు , పొడిలు ఇలా అనేక రకాల వెరైటీలు ఉంటాయి. కడుపు నిండా రుచికరమైన భోజనం దొరుకుతోంది.
(3 / 6)
ఇటీవల కోనసీమ జిల్లాల్లో ఖరీదైన పులస చేపతో ఏకంగా విందే పెట్టారు. ఇప్పుడు ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పుస్తలమ్మి అయినా సరే పులస చేప తినాలనే నానుడి ఉంది. ఆ పులస చేప అంత ఖరీదైనది. అలాగే రుచి కూడా ఖరీదుకు తగ్గట్టుగానే ఉంటుంది.
(4 / 6)
అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని పి.గన్నవరంలో ఫొటో, వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా విందు ఏర్పాటు చేశారు. ఏకంగా పులస చేపతో విందు ఏర్పాటు చేసి వారెవ్వా అనిపించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, ఇతర జిల్లాల ఫొటో, వీడియో గ్రాఫర్లకు పులస చేపతో విందు ఇచ్చి గోదారోళ్ల ఆతిథ్యం ఇట్టుంటాదని అనిపించారు. పులస చేపతో పాటు చికెన్, మటన్‌తో అనేక నాన్ వెజ్ రుచులు విందులో పెట్టారు.
(5 / 6)
అరకొరగా దొరికే పులస చేపతో విందు ఇవ్వడంతో దీనికి సంబంధించిన వీడియోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నాయి. భోజనాలు పెట్టడంలో ఎక్కడా వెనక్కి తగ్గని గోదారోళ్లు.. ఏకంగా పులసతో విందు పెట్టారని నెట్టింట్లో తెగ చెప్పుకుంటున్నారు.
(6 / 6)
పులస చేప గోదావరి జలాల్లోనే దొరుకుతుంది. అది కూడా వరదల సమయంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోనే దొరుకుతుంది. గోదావరికి ఎదురీత ఉండే ఈ పులస చేపలు జులై, ఆగస్టు మాసాల్లో దొరుకుతాయి. ఒక్కొ చేప రూ.5,000 నుంచి రూ.20,000, రూ.30,000 వరకు ఉంటుంది. డిమాండ్‌ను బట్టీ చేప ఖరీదు ఉంటుంది. తొలిసారి దొరికిన చేప ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది మొదటి సారి దొరికిన పులస చేప రూ.24,000కు అమ్ముడు పోయింది.(రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
ఇతర గ్యాలరీలు