Jai Bharat National Party : ఏపీలో మరో కొత్త పార్టీ - పేరును ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ-jd lakshmi narayana announced a political party named jai bharat national party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jai Bharat National Party : ఏపీలో మరో కొత్త పార్టీ - పేరును ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ

Jai Bharat National Party : ఏపీలో మరో కొత్త పార్టీ - పేరును ప్రకటించిన జేడీ లక్ష్మీనారాయణ

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 22, 2023 08:56 PM IST

JD Lakshmi Narayana Jai Bharat National Party : ఏపీలో మరో రాజకీయ పార్టీ వచ్చింది. 'జై భారత్ నేషనల్' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. ఈ మేరకు శుక్రవారం వివరాలను వెల్లడించారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

JD Lakshmi Narayana News Party : 'జై భారత్ నేషనల్ పార్టీ' పేరుతో రాజకీయ పార్టీని ప్రకటించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. ఈ మేరకు శుక్రవారం విజయవాడలో ప్రకటన చేశారు.వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నట్లు తెలిపారు. తమ పార్టీ పెట్టిన పార్టీ కాదన్న ఆయన… ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని చెప్పుకొచ్చారు. సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేడ్కర్ చెప్పారని… ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రత్యేక హోదా సాధన విషయంలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయని…. ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జై భారత్‌ నేషనల్‌ పార్టీ అని పేర్కొన్నారు.

ఏపీ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని... ఇక్కడే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని అన్నారు జేడీ లక్ష్మీనారాయణ. ఇలాంటి అంశాలను గుర్తించి... పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఉపాధి అవకాశాలు లేక యువత చాలా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనికి ప్రధాన కారణం... సరైన పాలసీలు లేకపోవటమే కారణమన్నారు. ప్రస్తుతం చూస్తుంటే... కొన్ని కుటుంబాలకు మాత్రమే రాజకీయాలు పరిమితమయ్యాయని వ్యాఖ్యానించారు. కుటుంబపాలన స్పష్టంగా కనిపిస్తోందని.. దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోందన్నారు.

బూటకపు రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు జేడీ లక్ష్మీనారాయణ. ప్రజల నుంచే పుట్టిన పాార్టీనే జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పారు. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమని అన్నారు. ప్రజాకాంక్షలను నెరవేర్చటమే తమ లక్ష్యమన్నారు. తాము తప్పులు చేయమని, అప్పులు చేయమని అన్నారు. ఏపీని గుజరాత్ కంటే ముందువరుసలో ఉంచుతామని తెలిపారు.

Whats_app_banner