JD Lakshminarayana : నాడు - నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయి - జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు-cbi ex jd lakshminarayana praises jagan govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Jd Lakshminarayana : నాడు - నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయి - జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు

JD Lakshminarayana : నాడు - నేడుతో పాఠశాలల రూపురేఖలు మారాయి - జగన్ పాలనపై జేడీ లక్ష్మీనారాయణ ప్రశంసలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 27, 2023 03:57 PM IST

CBI EX JD Lakshminarayana News: వైసీపీ సర్కార్ ను ప్రశంసించారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందన్నారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

CBI EX JD Lakshminarayana : జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించారు.

శ్రీశైలంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీ జేడీ లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ… పిల్లలకు రాగి జావ, నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. విద్యా, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మంచి ఫలితం ఉంటుందన్నారు.

“నాడు - నేడుతో పాఠశాలల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. పిల్లలకు మంచి ఆహారాన్ని కూడా ఇస్తున్నారు. జగనన్న సురక్ష క్యాంపులో మంచి ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ కృషిని అభినందించాలి” అని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

Whats_app_banner