Liquor Policy : బార్ వేలంపై పవన్ కళ్యాణ్ సెటైర్లు….
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన బార్ లైసెన్స్ ప్రక్రియలో ప్రభుత్వానికి రూ.100కోట్ల నష్టం వాటిల్లడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతూ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన బార్ వేలం ప్రక్రియపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. వేలం ప్రక్రియలో బార్ యజమానులు సిండికేట్‌గా మారి అప్‌సెట్ ధరకే లైసెన్స్‌లు దక్కించుకోవడాన్ని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేదమంటూ ప్రచారం చేసి ఇప్పుడు ఆ ఊసు ఎత్తకపోవడాన్ని విపక్షాలు తప్పు పడుతున్నాయి. ఈ క్రమంలో పవర్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ పెట్టారు.
బార్ లైసెన్స్‌ల కేటాయింపులో ప్రభుత్వానికి వందకోట్ల నష్టం వాటిల్లందని బాధపడుతున్న వ్యక్తి, ఓ మహిళతో వందకోట్లు పోయాయని మేము ఏడుస్తుంటే మధ్యలో మద్య నిషేదం అంటూ నీ గోలేంటని పశ్నిస్తారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించిన పవన్ కళ్యాణ్్ ఈ ట్వీట్ చేసినట్లు అర్ధమవుతుంది.
దశల వారీగా మద్య నిషేధమని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వంపై వ్యంగ్య చిత్రాలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. మద్యం అమ్మకాలు, బార్ లైసెన్స్‌ల కేటాయింపు వ్యవహారంలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని జిల్లాల్లో అప్‌సెట్ ధరకు నాలుగైదు రెట్లు ఆదాయం వస్తే మరికొన్ని జిల్లాల్లో కనీస ధర కూడా లభించలేదు. వ్యాపారులు ముందే సిండికేట్‌గా మారి వేలం పాడుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోపణలు వచ్చాయి.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మద్య నిషేధం వ్యవహారంలో పెదవి విప్పడం లేదు. తాము మద్య నిషేధమని ఎప్పుడూ చెప్పలేదని,మద్య నియంత్రణ మాత్రమే చేస్తామన్నామని ఇటీవల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ప్రకటించడం విమర్శలకు కారణమైంది.
ఏపీలో ఏటా 22వేల కోట్ల రుపాయల ఆదాయం మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి లభిస్తోంది. మద్యంపై వచ్చే చూపి రాష్ట్ర ప్రభుత్వం ముందే నిధుల సమీకరణ చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో మద్య నిషేధం నుంచి ఏపీ పక్కకు తప్పుకునే అవకాశాలు ఏ మాత్రం కనిపించట్లేదు. దీనికి తోడు వ్యాపారులు సిండికేట్‌గా మారిన వైనాన్ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు.
టాపిక్