AP CID : హైదరాబాద్ లోని కొలికపూడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?-hyderabad news in telugu ap cid filed case on kolikapudi srinivasarao search at his house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cid : హైదరాబాద్ లోని కొలికపూడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

AP CID : హైదరాబాద్ లోని కొలికపూడి ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

Bandaru Satyaprasad HT Telugu
Dec 30, 2023 05:34 PM IST

AP CID : హైదరాబాద్ లోని కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. ఆర్జీవీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన సీఐడీ... కొలికపూడిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.

కొలికపూడి శ్రీనివాసరావు
కొలికపూడి శ్రీనివాసరావు

AP CID : అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లోని కొలికపూడి ఇంటికి వెళ్లారు. శ్రీనివాసరావు ఇంట్లో లేకపోవడంతో ఆయన నివాసం వద్ద కాసేపు ఎదురుచూసిన సీఐడీ అధికారులు చివరికి వెనుదిరిగారు. రెండ్రోజుల క్రితం కొలికపూడిపై ఆర్జీవీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆర్జీవీ ఫిర్యాదుతో కొలికపూడి శ్రీనివాసరావుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. నల్లగుండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్లిన సీఐడీ పోలీసులు కొలికపూడి సతీమణిని ఆఫీసు నుంచి ఇంటికి రావాలని పిలిపించారు.

ఆర్జీవీపై వివాదాస్పద వ్యాఖ్యలు

డైరెక్టర్ రాంగోపాల్‌ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ. కోటి నజరానా చెల్లిస్తానంటూ టీడీపీ మద్దతుదారు కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ లైవ్‌ లో పదే పదే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేగింది. ఈ వీడియోను ట్విట్టర్‌ లో షేర్‌ చేసి ఆర్జీవీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జీవీ సామాజిక మాధ్యమాల్లో తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపించేందుకు కాంట్రాక్ట్‌ ఇచ్చారని, ఓ న్యూస్ ఛానల్ యాంకర్ ఆయనకు సాయం చేస్తున్నారని ఆరోపించారు. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ తో కలిసి ఆర్జీవీ...విజయవాడలో డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీనివాసరావు లైవ్ టీవీలో నన్ను చంపి నా తలను తీసుకువచ్చినవాడికి కోటి రూపాయలు ఇస్తానని బహిరంగంగా ఆఫర్ ఇచ్చారని లిఖిత పూర్వత ఫిర్యాదు చేశారు. న్యూస్ ఛానల్ లో చర్చా కార్యక్రమం పెట్టిన యాంకర్, ఆ న్యూస్ ఛానల్ యజమాని, కొలకపూడి శ్రీనివాసరావుపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జీవీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.

Whats_app_banner