Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తల మృతి, మృతులు పల్నాడు వాసులు-husband and wife killed in a road accident in bapatla district the deceased were residents of palnadu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తల మృతి, మృతులు పల్నాడు వాసులు

Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తల మృతి, మృతులు పల్నాడు వాసులు

HT Telugu Desk HT Telugu
Jun 14, 2024 10:49 AM IST

Bapatla Road Accident: బాప‌ట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో దంపతులు మృతి చెందారు. మృతులను ప‌ల్నాడు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

బాపట్ల జిల్లా రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
బాపట్ల జిల్లా రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

Bapatla Road Accident: బాపట్ల జిల్లాలో లారీ ఢీకొని భార్యాభ‌ర్త‌లు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా మేద‌రమెట్ల స‌మీపంలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా రొంపిచ‌ర్ల గ్రామం సుబ్బారెడ్డి కాల‌నీకి చెందిన బ‌త్తుల కొండ‌లు (49), ల‌క్ష్మి (41) దంప‌తులు త‌మ పెద్ద కుమార్తె గ్రామం ఇంకొల్లు మండ‌లం దుద్దుకూరు గ్రామంలో జ‌రుగుతున్న దేవుడి కొలుపుల‌కు వెళ్లారు.

yearly horoscope entry point

తిరిగి ద్విచ‌క్ర‌వాహ‌నంలో ఇంటికి వ‌స్తుండ‌గా బాప‌ట్ల జిల్లా మేద‌ర‌మెట్ల స‌మీపంలో రాంగ్‌రూట్‌లో వ‌స్తున్న లారీ ఈ ద్విచ‌క్ర‌వాహ‌నాన్ని ఢీకొట్టింది. దీంతో దంప‌తులిద్ద‌రూ అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించారు. మృతదేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఆటో బోల్తా ప‌డి ఒక‌రు మృతి

క‌ర్నూలు జిల్లా ఆలూరు మండ‌లంలో ఆటో బోల్తా ప‌డి ఒక‌రు మృతి చెందారు. ప్ర‌మాద‌వ‌శాత్తు ఆటో బోల్తా ప‌డిన ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా, మ‌రొక‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆలూర మండ‌లంలోని పెద్ద హోతుర్ గ్రామం స‌మీపంలో ఆటో బోల్తా ప‌డ‌టంతో అక్క‌డికక్క‌డే ఒక‌రు మృతి చెందారు. తీవ్రంగా గాయ‌ప‌డి వారిని ఆలూరు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

గోదావ‌రిలో ఈవోపీఆర్డీ మృత‌దేహం

రాజ‌మండ్రి గోదావ‌రి పిండాల రేవులో విజ‌య‌వాడ తోట్లవ‌ల్లూరుకు చెందిన ఈవోపీఆర్డీ వెంక‌ట‌ర‌మ‌ణారావు (61) మృత దేహం ల‌భ్యం అయింది. ర‌మ‌ణారావు పంచాయ‌తీరాజ్ శాఖ‌లో ప‌ని చేస్తున్నారు. ఆయ‌న‌కు వివాహ‌మైన ఇద్ద‌రు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అల్లుడు క‌రోనా స‌మ‌యంలో చ‌నిపోయాడు. దీంతో మాన‌సికంగా కుంగిపోయార‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు.

అయితే ఈనెల బంద‌రులో ఉన్న త‌న త‌ల్లిని చూసేందుకు వెళ్తాన‌ని చెప్పి ఇంటి వ‌ద్ద నుండి వెళ్లారు. కానీ ఆయ‌న రాలేదు. అలాగే ఫోన్ కూడా స్విచ్ఛాప్ అయింది. దీంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేశారు. ఇంత‌లోనే గోదావ‌రి పిండాల రేవులో గుర్తు తెలియ‌ని మృత‌దేహం ల‌భ్యం అయింద‌ని పోలీసులు తెలిపారు. దీంతో కుటుంబ స‌భ్యులు స‌హ‌కారంతో అది ఈవోపీఆర్డీ వెంక‌ట‌ర‌మ‌ణారావు మృత‌దేహ‌మ‌ని గుర్తించారు.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner