Rains in Andhra Pradesh: లంక గ్రామాల్లో వరద బీభత్సం - ఊరు దాటుతున్న జనం-high alert in andhra pradesh for godavari river floods due to heavy rains live news ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Rains In Andhra Pradesh: లంక గ్రామాల్లో వరద బీభత్సం - ఊరు దాటుతున్న జనం

విశాఖపట్నంలో లోతట్టు ప్రాంతాలకు సేవలు అందిస్తున్న ఇండియన్ నేవీ హెలికాప్టర్(PTI)

Rains in Andhra Pradesh: లంక గ్రామాల్లో వరద బీభత్సం - ఊరు దాటుతున్న జనం

06:52 AM ISTJul 16, 2022 05:47 PM HT Telugu Desk
  • Share on Facebook
06:52 AM IST

  • Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్, ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలు వరదల కారణంగా కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం పోటెత్తుతోంది.

Sat, 16 Jul 202212:18 PM IST

లంక గ్రామాల్లో వరద బీభత్సం

లంక గ్రామాల్లో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. అక్కడి  ప్రజలు ఊర్లను దాటి వెళ్తున్నారు.  అధికారులు గ్రామాలను ఖాళీ చేయాలని సూచిస్తున్నారు.

Sat, 16 Jul 202212:15 PM IST

గండి పడటంతో భారీగా వరద…

కోనసీమ: పాతఇంజరం గోదావరి దగ్గర గండి పడింది. దీంతో పలు గ్రామాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గ్రామాలను తక్షణమే ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sat, 16 Jul 202204:58 AM IST

సీఎం జగన్ సమీక్ష

గోదావరి వరదలపైసీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ప్రతి గంటకో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

Sat, 16 Jul 202203:57 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

ఇన్ ఫ్లో : 3,67,698 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 12,714 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులు

ప్రస్తుతం : 848.30 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 76.3162 టీఎంసీలు

టీఎస్ జెన్కో లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

Sat, 16 Jul 202203:57 AM IST

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న వరద

30 గేట్ల ద్వారా కొనసాగుతున్న వరద

ఇన్ ఫ్లో 1,32,365 క్యూసెక్కులు..

అవుట్ ఫ్లో 1,58,400 క్యూ సెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు

ప్రస్తుతం నీటి నిల్వ 94.514 టీఎంసీలు

నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Fri, 15 Jul 202201:23 PM IST

ఒక్కో సీనియర్‌ అధికారి నియామకం

వరద ప్రభావిత జిల్లాలకు ఒక్కో సీనియర్‌ అధికారి నియామకం

వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ ఆదేశం

Fri, 15 Jul 202201:23 PM IST

సీఎం ఆదేశాలు…

రాబోయే 24 గంటలు చాలా కీలకం.. హైఅలర్ట్‌గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్‌ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు సహా పలు జిల్లాల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు‌. ఆయా ప్రాంతాల్లో వరద పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలపై సమీక్షలో చర్చించారు.

Fri, 15 Jul 202201:19 PM IST

శ్రీశైలంలోని తాజా పరిస్థితి…

శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 840.1 అడుగులు

శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు

శ్రీశైలంలో ప్రస్తుత నీటినిల్వ 61.92 టీఎంసీలు

శ్రీశైలంలో పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు

శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి

Fri, 15 Jul 202211:52 AM IST

సీఎం జగన్ ఏరియల్ సర్వే..

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు.

Fri, 15 Jul 202208:06 AM IST

దవళేశ్వరానికి పెరుగుతున్న వరద

1986లో భారీ వరదలను ఎదుర్కున్న దవళేశ్వరం.. మరోసారి భారీ వరదను ఎదుర్కోబోతోంది. నాడు 35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా, ఇప్పుడు ప్రస్తుతానికి 20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

Fri, 15 Jul 202205:26 AM IST

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతంది. ఇన్ ఫ్లో  2,61,7332 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్దాయి నీటి మట్టం 885.00 అడుగులుగా ఉంది. ప్రస్తుతం 836.40 అడుగులకు నీటి మట్టం పెరిగింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం 56.7890 టీఎంసీల నీరుంది. టీఎస్ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.

Fri, 15 Jul 202205:09 AM IST

లంక గ్రామాలను ముంచెత్తుతున్న వరద నీరు

గోదావరి వరదల కారణంగా భద్రాచలం, దవళేశ్వరం వద్ద క్రమేపీ వరద ఉగ్రరూపం దాల్చుతోంది. పశ్చిమ గోదావరిలోని పలు మండలాల్లో గల లంక గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ఆచంట మండంలోని పుచ్చలంక, మర్రిమూల, నక్కిలంక, రావిలంక, భీమలపాపం, యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, యలమంచిలి లంక, బాడవ గ్రామాల్లో వరద ముంచెత్తుతోంది.  ఇప్పటికే పుచ్చలంక, రావిలంక, మర్రిమూల, కనకాయలంక, పెదలంక, పల్లిపాలెం గ్రామాల నుంచి బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. జిల్లా యంత్రాంగం, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నాయి. నరసాపురం పట్టణంలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, జిల్లా కలెక్టర్, ఎస్పీ పర్యటించారు. పోడూరు మండలంలో తాడేరు, నక్కల కాలువలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

Fri, 15 Jul 202204:39 AM IST

శ్రీశైలానికి పోటెత్తుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి వరద తాకిడి మొదలైంది. జూరాల నుంచి లక్షకు పైగా, సుంకేసుల నుంచి మరో లక్ష క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి వస్తోంది. ఈ ఉదయం 6 గంటలకు శ్రీశైలం నీటి ప్రవాహం 835.60 అడుగులకు చేరింది.

WhatsApp channel

టాపిక్