Student Murder: గుంటూరులో ఘోరం, 9వ తరగతి విద్యార్థిని హత్య చేసిన సహ విద్యార్థులు, కేసు నమోదులో పోలీసుల తాత్సారం
Student Murder: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అమరావతి మండలం పొన్నేకల్లులో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సహవిద్యార్థుల చేతిలో హత్యకు గురయ్యాడనే ఆరోపణలు వస్తున్నా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేని విద్యార్థిని స్నేహితులు కొట్టి చంపేసి బావిలో పడేశారు.
Student Murder: గుంటూరు జిల్లా అమరావతిలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. తల్లిదండ్రుల్ని కోల్పోయి నానమ్మ వద్ద పెరుగుతున్న తొమ్మిదో తరగతి బాలుడు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పవడం కలకలం రేపింది. బాలుడు బావిలో శవమై కనిపించినా గ్రామస్తులు పట్టనట్టు వ్యవహరించడం సంచలనం సృష్టించింది. తల్లిదండ్రులు లేని విద్యార్థిని స్నేహితులు దారుణంగా కొట్టి చంపేశారనే ఆరోపనలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందినా దర్యాప్తు జరపకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నే కల్లులో గత నెల 24న చోటుచేసుకున్న ఘటన వివ రాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన బాలుడు షేక్ సమీర్ స్వగ్రామం గుంటూరు జిల్లా అమరావతి మండలం కర్లపూడి గ్రామం కాగా బాలుడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో పొన్నెకల్లులోని నాయనమ్మ మస్తాన్ బీ వద్ద పెరుగుతున్నాడు.
పొన్నేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి (బీ సెక్షన్) చదువుతున్నాడు. అదే పాఠశాలలో 9వ తరగతి ఏ సెక్షన్ విద్యార్థులతో సమీర్‌కు గొడవ జరిగింది. ఏ సెక్షన్‌కుే చెందిన పది మంది విద్యార్థులు కొద్ది రోజుల క్రితంబాలుడితో గొడవపడి కొట్టి భయపెట్టారు. దీంతో అతను అక్టోబర్ 24న పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్ద ఉండిపోయాడు.
ఆ సమయంలో పాఠశాలలో మాక్ డ్రిల్ జరుగుతుండగా 9వ తరగతి విద్యార్థులు డ్రిల్ చేయకుండా బయటకు వెళ్లిపోయారు. ఇంటి వద్ద ఉన్న సమీర్‌ను తీసుకొని ఈత కొడదామని గ్రామ పొలిమేరల్లో ఉన్న బావి వద్దకు తీసుకు వెళ్లి అతనిపై దాడి చేసి అందులో పడేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీయించారు. బాలుడి శరీరంపై రక్తం, గాయాలు ఉండటం, చొక్కాపై రక్తపు మరకలు ఉండటాన్ని గుర్తించారు.
ఆ సమయంలో గ్రామంలోని కొందరు పోలీసుల్ని మేనేజ్ చేసి కేసు నమోదు కాకుండా అడ్డుకున్నారు. పోస్టుమార్టం జరగకుండా మృతదేహాన్ని రాత్రికిరాత్రి కర్లపూడి తరలించారు. కర్లపూడిలో బాలుడి మృతదేహంపై గాయాలను చూసిన బంధువులు గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లారు. మర్నాడు పాఠశాలకు వచ్చిన సర్పంచ్ విద్యార్థి మృతిసౌ ఉపాధ్యాయులతో మాట్లాడారు. బాలుడిపై ఆధారపడిన మస్తాన్‌బీ ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు.
దీంతో ఉపాధ్యాయులు రూ.50 వేలు పోగేసి ఇవ్వాలనుకున్నారు. దీనికి సర్పంచ్ అభ్యంతరం చెప్పారు. మస్తాన్‌బీ తో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయిం చారు. ఆ తర్వాత కూడా ఈ వ్యవహారం బయటకు రాలేదు. ఈ ఘటనను పోలీసులు, విద్యాశాఖ తేలిగ్గా తీసుకోవడం, కేసు నమోదు చేయకపోవడంపై పలు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. బాలుడికి తల్లిదండ్రులు లేకపోవడంతో, విద్యార్థిని హత్య చేసిన వారిని కాపాడేందుకు కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మృతి చెందిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా గ్రామస్తుల ఒత్తిడికి లొంగి వ్యవహారం బయటకు రాకుండా తొక్కి పెడుతున్నారని ఆరోపిస్తున్నారు.
టాపిక్