Guntur Accident : ఘోర రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి, కాన్వాయ్ ఆపి మంత్రి సవిత సహాయ చర్యలు
Guntur Accident : గుంటూరు జిల్లా మంగళగిరి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అటుగా వెళ్తున్న మంత్రి సవిత ఈ ప్రమాదం గమనించి వెంటనే క్షతగాత్రులకు సాయం అందించారు.
Guntur Accident : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అటుగా వెళ్తున్న మంత్రి ఎస్. సవిత ప్రమాదాన్ని గమనించి చలించిపోయారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపి సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు నీరు తాగించి వారిని ఆసుపత్రికి తరలించారు.
ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెనాలి వెళ్లే ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను కారు ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ప్రమాదాన్ని గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపి సహాయక చర్యలను చేపట్టారు. క్షతగాత్రులకు తక్షణంగా కావాల్సిన మంచి నీరు అందించి వారిని ఆసుపత్రికి పంపించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.
మంత్రి సవిత తన సెక్యూరిటీ, ఇతర సిబ్బంది సాయంతో ఆటోలో ఇరుక్కున్న క్షతగాత్రులను బయటకు తీయించారు. అనంతరం వారికి ధైర్యం చెబుతూ సిబ్బందితో అంబులెన్స్‌కు ఫోన్ చేయించి, వేగంగా అంబులెన్స్‌ను రప్పించారు. క్షతగాత్రులను సెక్కూరిటీ, ఇతర సిబ్బందితో అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన బాలుడి మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. అలాగే వైద్యులకు ఫోన్ చేసి క్షతగాత్రులకు చికిత్స వేగవంతం చేయాలని సూచించారు.
కళ్ల ముందే కన్న బిడ్డ చనిపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి. దీంతో మంత్రి సవిత వారికి ధైర్యం చెప్పారు. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అక్కడి వారిని సమాచారం అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అలాగే చర్యలకు పోలీసు అధికారులకు మంత్రి సవిత ఆదేశించారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం