Trains Cancellation: పెద్దపల్లిలో పట్టాలు తప్పిన గూడ్స్, గ్రాండ్ ట్రంక్ మార్గంలో భారీగా రైళ్లు రద్దు, దారి మళ్లింపు
Trains Cancellation: రామగుండం - పెద్దపల్లి స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దయ్యాయి. ఏపీ తెలంగాణలలో పలు రైళ్లును రద్దు చేయడంతో పాటు దారి మళ్ళిస్తున్నారు. చెన్నై - డిల్లీ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ళు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Trains Cancellation: గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో చెన్నై- ఢిల్లీ ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. రామగుండం-పెద్ద పల్లి మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మూడు రైల్వే లైన్లు దెబ్బతినడంతో ఏపీ తెలంగాణ మీదుగా ఢిల్లీ వైపు వెళ్లే రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నారు.
రద్దైన రైళ్లు ఇవే..
- ట్రైన్ నంబర్ 20101 నాగపూర్-సికింద్రబాద్, ట్రైన్ నంబర్ 20102 సికింద్రాబాద్-నాగపూర్ రైలును నేడు రద్దు చేశారు.
- ట్రైన్ నంబర్ 17011 హైదరాబాద్ సిర్పూర్ కాగజ్‌నగర్, ట్రైన్ నంబర్ 12757 సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్,, ట్రైన్ నంబర్ 12758 సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్, ట్రైన్ నంబన్ 17003 కాజీపేట- సిర్పూర్ టౌన్, ట్రైన్ నంబర్ 07766 సిర్పూర్ టౌన్- కరీంనగర్, ట్రైన్ నంబర్ 07894 కరీంనగర్-బోధన్, ట్రైన్ నంబర్ 07893 బోదన్ - కరీంనగర్, ట్రైన్ నంబర్ 07765 కరీంనగర్- సిర్పూర్ టౌన్, ట్రైన్ నంబర్17034 సిర్పూర్ టౌన్ భద్రాచలం రోడ్, ట్రైన్ నంబర్ 17033 భద్రాచలం రోడ్-బలార్షా, ట్రైన్ 17004 బల్లార్షా- కాజీపేట రైళ్లు నేడు రద్దు అయ్యాయి.
- ట్రైన్ నంబర్ 06229 యశ్వంతపూర్-ముజఫర్‌నగర్, ట్రైన్ నంబర్ 17661, కాచిగూడ నాగర్‌సోల్, ట్రైన్ నంబర్ 07793 కాచిగూడ కరీంనగర్, ట్రైన్ నంబర్ 07794 కరీంనగర్ - కాచిగూడ, ట్రైన్ నంబర్ 07695 సికింద్రాబాద్-రామేశ్వరం, 07696 రామేశ్వరం సికింద్రాబాద్, సికింద్రాబాద్ - తిరుపతి 07041, తిరుపతి సికింద్రాబాద్ 07042, అదిలాబాద్- పర్లి 07775, పర్లి ఆదిలాబాద్ 07852, పూర్ణ - అకోలా 07773, అకోలా -పూర్ణ 07855, ఆదిలాబాద్ నాందేడ్ 17409, నాందేడ్ ఆదిలాబాద్ 17410, నిజామాబాద్ కాచిగూడ 07595, కాచిగూడ- రాయ్‌చూర్ 07477, రాయ్‌చూర్ -కాచిగూడ 07478, గుంతకల్ -బోధన్ 07671, బోదన్- కాచిగూడ 07275, కాచిగూడ-గుంతకల్ 07670 రైళ్లు రద్దు అయ్యాయి.
- రాఘవాపురం వద్ద రైలు పట్టాలు తప్పడంతో ట్రైన్ నంబర్ 17233 సికింద్రాబాద్- సిర్‌పుర్ కాగజ్ నగర్ రైలును పెద్దపల్లి-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రద్దు చేశారు.
- ట్రైన్ నంబర్ 17234 సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ రైలును నేడు సిర్పూర్ కాగజ్ నగర్- పెద్దపల్లి మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
- ట్రైన్ నంబర్ 16093 చెన్నై సెంట్రల్-లక్నో రైలును పెద్దపల్లి-నిజామాబాద్ - పూర్ణ- అకోలా- వార్ధా మీదుగా మళ్లించారు. ఈ రైలును రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్, బలార్షా, చంద్రపూర్, హింగన్‌ఘాట్, సేవా గ్రామం స్టేషన్ల మినహాయించారు.
- ట్రైన్ నంబర్ 12651 మధురై- నిజాముద్దీన్ రైలును పెద్దపల్లి-నిజమాబాద్, ముద్‌ఖేడ్, పింపల్‌కుట్టిల మీదుగా మళ్లించారు.
- ట్రైన్ నంబర్ 12390 చెన్నై సెంట్రల్ - గయా రైలును పెద్దపల్లి-నిజామాబాద్, ముద్‌ఖేడ్ వైపుగా నడుపుతున్నారు.
- ట్రైన్ నంబర్ 03242 బెంగుళూరు-ధనపూర్ రైలును పెద్దపల్లి-నిజాబాద్- పూర్ణ, అకోలా వైపు మళ్లిస్తున్నారు.
- ట్రైన్ నంబర్ 12656 చెన్నై సెంట్రల్ - అహ్మదాబాద్ రైలు పెద్దపల్లి-నిజాబాద్-అకోలా మీదుగా మళ్లించారు.
- ట్రైన్ నంబర్ 20805 విశాఖపట్నం-న్యూఢిల్లీలో రైలును విశాఖపట్నం, విజయనగరం, రాయగడ, టిట్లాఘర్, నాగ్‌పూర్ వైపు నడుపుతున్నారు.
- హెల్ప్ లైన్ నంబర్లు…
- గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో దక్షిణ మధ్య రైల్వే పలు స్టేషన్లలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్‌లో 040-27786140, 2778 6170, కాజీపేటలో 0870-2576430, వరంగల్‌లో 90633 24898, ఖమ్మంలో 78159 55306 నంబర్లలో రైళ్ల సమాచారం తెలుసుకోవచ్చు.
- పట్టాలు తప్పిన 11 బోగీలు..
ఈ ఘటన పెద్దపల్లి-రామగుండం మధ్య జరిగింది.ఘజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ లోడ్ తో వెళ్తున్న గూడ్స్ పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ - కన్నాల మధ్య పట్టాలు తప్పింది. 11 బోగీలు బోల్తా పడిపడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. ఓవర్ లోడ్ తోనే గూడ్స్ రైలు బోల్తా పడినట్లు భావిస్తున్నారు. గూడ్స్ బోల్తా పడటంతో ఆ మార్గంలో నడిచే పలు రైలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
పెద్దపల్లి రైల్వేస్టేషన్ లో సికింద్రాబాద్ నుండి బళ్లార్షా వైవు వెళ్లే భాగ్య నగర్ ఎక్సప్రెస్ రైలు, మధురై నుండి హాజ్రత్ నిజముద్దీన్ కు వెళ్లే సంపార్క్ క్రాంతి రైలు నిలిచిపోయాయి. కొత్తపల్లి రైల్వే స్టేషన్ లో చెన్నై నుండి ఢిల్లీ కి వెళ్లే లక్నో ఎక్సప్రెస్ రైల్ ను నిలిపివేశారు. గూడ్స్ రైలు బోల్తాతో రైల్వే అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు.
పునరుద్ధరణకు 24గంటలు పట్టే అవకాశం…
కన్నాల గేట్ వద్ద 11 వ్యాగన్లు పట్టాలపై పడిపోవడంతో కాజీపేట్-బల్లార్షా మధ్య ఉన్న మూడు రైల్వే లైన్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాద తీవ్రతకు పట్టాలు విరిగిపోయి చెల్లాచెదురయ్యాయి. విద్యుత్ పోల్స్ సైతం విరిగిపోయాయి. వ్యాగన్లు ఒక్కదానిపైకి ఒక్కటి ఎక్కడంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు కష్టంగా మారాయి.
రైలు ఇంజిన్, గార్డ్ వ్యాగన్ పట్టాలు తప్పలేదు. మధ్యలో ఉన్న బోగీలుపడిపోయాయి. ట్రాక్ పునరుద్ధరణ పనులు రాత్రి 11 గంటల తరువాత మొదలయ్యాయి. రైలు ఇంజిన్‌వైపు ఉన్న 8 వ్యాగన్లతోసహా గూడ్స్‌ను రామగుండంకు తరలించారు. భాగ్యనగర్ రైలు రాఘవాపూర్‌కు చేరుకోగా, దానిని వెనుకకు మళ్లించి పెద్దపల్లి స్టేషన్ లో ప్రయాణికులను దింపివేశారు.
వరంగల్ వైపు వెళ్లే మరికొన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రామగుండం, మంచిర్యాల రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు కనీసం 24 గంటల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కనీస ఒక్క లైన్‌లోనైనా రాకపోకలు పునరుద్దరించేందుకు ప్రయత్నిస్తున్నారు.