Kadapa: భిక్షాటన చేసే బాలికపై గ్యాంగ్ రేప్.. అలా జరగటంతో వెలుగులోకి అసలు విషయం!-gang rape on a girl at proddatur in ysr kadapa district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Kadapa: భిక్షాటన చేసే బాలికపై గ్యాంగ్ రేప్.. అలా జరగటంతో వెలుగులోకి అసలు విషయం!

Kadapa: భిక్షాటన చేసే బాలికపై గ్యాంగ్ రేప్.. అలా జరగటంతో వెలుగులోకి అసలు విషయం!

HT Telugu Desk HT Telugu
May 12, 2022 10:43 AM IST

వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఓ బాలికపై పది మందికిపైగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఫలితంగా సదరు బాలిక గర్భం దాల్చటం సంచలనంగా మారింది.

<p>కడపలో సామూహిక అత్యాచార ఘటన</p>
కడపలో సామూహిక అత్యాచార ఘటన

ఆ బాలిక ఓ మసీదు వద్ద బిక్షటాన చేస్తూ ఆశ్రమం పొందుతుంది. తల్లి లేదు.. తండ్రి మరో ఆలయం వద్ద బిక్షాటనే చేస్తాడు. ఈ పరిస్థితుల్లో ఆ మైనర్ బాలికపై.. డెకరేషన్ షాప్ లో పని చేసే యువకుడు కన్నేశాడు. అతడే కాదు..తోటి స్నేహితులతో కలిసి గతకొంతకాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నారు. సీన్ కట్ చేస్తే ఆ మైనర్ బాలిక గర్భం దాల్చటంతో విషయం బయటికి వచ్చింది. ఈ ఘటన కడప జిల్లాలో సంచలనం రేపుతోంది.

yearly horoscope entry point

వివరాల్లోకి వెళ్తే...

ప్రొద్దుటూరు పట్టణంలోని ఇస్లాంపురం వీధిలోని మసీదు వద్ద మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. కొన్ని ఏళ్ల క్రితం తల్లి చనిపోయింది. తండ్రి కూడా భిక్షాటన చేస్తుంటాడు. అదే వీధిలో బంధువుల ఇంట్లో ఉంటూ డెకరేషన్‌ పనులు చేసే యువకుడు చెంబు... ఆ బాలికపై కన్నేశాడు. అతడితో పాటు స్నేహితులు గత కొంతకాలంగా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం బయటికి రావటంతో పోలీసులకు చేరింది.

ఈ నెల 4న ఓ మహిళా పోలీస్... ఆ బాలికతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో చెంబు, అతని స్నేహితుల విషయాన్ని ఆ బాలిక చెప్పింది. పలుమార్లు అఘాయిత్యం చేసినట్లు పేర్కొంది. ఆ బాలిక చెప్పిన విషయాలను వీడియో తీశారు కానిస్టేబుల్. ఆ తరువాత బాలికను ఓ ప్రైవేట్ ఆశ్రమానికి తరలించారు పోలీసులు. అయితే కేసు నమోదు చేయకపోవటంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ ఘటనపై ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు స్పందించారు. అత్యాచార ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. ఎవర్నీ వదిలేది లేదని.. త్వరలోనే కొలిక్కి వస్తుందని చెప్పుకొచ్చారు.

ఏదా గన్.. ఎక్కడా..? - నారా లోకేశ్

అత్యాచార ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు."గ‌న్ కంటే ముందొస్తాడ‌ని కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌ల ద్వారా ప్ర‌చారం చేయించుకున్న జ‌గ‌న్ సొంత క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగ‌ని ద‌ళిత‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగితే..ఏదా గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌?’’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. అమాయ‌క బాలిక‌పై లైంగిక దాడిని మ‌హిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని ప‌ట్టుకోకుండా కేసు మాఫీ చేయాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని విమర్శించారు.15 ఏళ్లు కూడా నిండ‌ని బాలిక‌ని గ‌ర్భ‌వ‌తిని చేసిన నిందితుల‌ని కాపాడ‌ట‌మేనా ఆడ‌బిడ్డ‌ల‌కి క‌ల్పించే ర‌క్ష‌ణ అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Whats_app_banner