Trains Information : 17 రూట్లలో రైళ్ల దారి మళ్లింపు, మరో 3 రైళ్లు రీషెడ్యూల్
ప్రయాణికులకు వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా 17 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. మరో 3 రైళ్లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ వివరించారు.
వరంగల్ - హసన్‌పర్తి - కాజీపేట 'ఎఫ్' క్యాబిన్ మధ్య ప్రస్తుతం ఉన్న ట్విన్ సింగిల్ లైన్‌తో ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న ట్విన్ సింగిల్ లైన్లను క్వాడ్రపుల్ లైన్‌లుగా మార్చడంతో క్రాస్ మూవ్‌మెంట్ కారణంగా పలు రైళ్ల రాకపోకలను దక్షిణ మధ్య రైల్వే నిలుపుదల చేస్తుంది.
నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపట్టడం ద్వారా వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట 'ఎఫ్' క్యాబిన్ - హసన్‌పర్తి రోడ్ స్టేషన్ మధ్య క్వాడ్రపుల్ లైన్ల కమీషన్‌తో లైన్ సామర్థ్యాన్ని అప్‌గ్రేడ్ చేయడంతో 17 రైళ్లు దారి మళ్లించనున్నారు. మూడు రైళ్లను రీషెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. విశాఖపట్నం-దువ్వాడ-విజయవాడ-వరంగల్-బల్లార్షకు బదులుగా విజయనగరం-రాయగడ-టిట్లాగఢ్-రాయ్‌పూర్-నాగ్‌పూర్ మీదుగా ఎనిమిది రైళ్లు దారి మళ్లించారు.
1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-న్యూఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (20805) రైలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 10 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
2. న్యూఢిల్లీ నుండి బయలుదేరే న్యూఢిల్లీ-విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ప్రెస్ (20806) రైలు సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 10 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
3. విశాఖపట్నంలో బయలుదేరే విశాఖపట్నం–గాంధీధామ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20803) సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 3 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
4. గాంధీధామ్ నుండి బయలుదేరే గాంధీధామ్ -విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20804) రైలు సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 6 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
5. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం–హెచ్.నిజాముద్దీన్ స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12803) రైలు సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 4 వరకు మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
6. హెచ్.నిజాముద్దీన్ నుండి బయలుదేరే హెచ్.నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12804) రైలు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 6 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
7. పూరి నుండి బయలుదేరే పూరీ-ఓఖా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20819) రైలు సెప్టెంబర్ 22, సెప్టెంబర్ 29 తేదీలలో దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
8. ఓఖా నుండి బయలుదేరే ఓఖా-పూరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20820) రైలు సెప్టెంబర్ 25, అక్టోబర్ 2 తేదీలలో దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
మరోవైపు విశాఖపట్నం-విజయవాడ-వరంగల్-సికింద్రాబాద్‌కు బదులుగా గుంటూరు-పగిడిపల్లి మీదుగా ఎనిమిది రైళ్లు దారి మళ్లించారు. వీటిని వివరాలను అధికారులు ప్రకటించారు.
1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్(18519) రైలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దాకి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
2. లోకమాన్య తిలక్ టెర్మినల్ నుండి బయలుదేరే లోకమాన్య తిలక్ టెర్మినల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18520) రైలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
3. సీఎస్‌టీ ముంబై నుండి బయలుదేరే సీఎస్‌టీ ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11019) రైలు సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
4. భువనేశ్వర్ నుండి బయలుదేరే భువనేశ్వర్-సీఎస్‌టీ ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (11020) రైలు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
5. షాలిమార్ నుండి బయలుదేరే షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18045) రైలు సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 6 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
6. హైదరాబాద్‌లో బయలుదేరే హైదరాబాద్- షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046) రైలు సెప్టెంబర్ 24 నుండి సెప్టెంబర్ 30 వరకు దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
7. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20833) రైలు అక్టోబర్ 7న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
8. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20707) రైలు సెప్టెంబర్ 29న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
గుంతకల్-రాయచూర్-సికింద్రాబాద్-వరంగల్ కాకుండా గుంతకల్-నంద్యాల-గుంటూరు-విజయవాడ మీదుగా దారి మళ్లించిన రూట్‌లో ఒక రైలు నడుస్తుంది.
1. యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే యశ్వంత్‌పూర్ - టాటానగర్ ఎక్స్‌ప్రెస్ (18112) రైలు సెప్టెంబర్ 29న దారి మళ్లించిన మార్గంలో నడుస్తుంది.
మూడు రైళ్ల రీషెడ్యూల్…
1. హైదరాబాద్-షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ (18046 ) రైలు అక్టోబర్ 1న షెడ్యూల్ ప్రకారం ఉదయం 8:00 గంటలకు బయలుదేరడానికి బదులుగా 1ః30 గంటల ఆలస్యంగా ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరుతుంది.
2. విశాఖపట్నం-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20833) రైలు సెప్టెంబర్ 27న షెడ్యూల్ ప్రకారం ఉదయం 5:45 గంటలకు బయలుదేరడానికి బదులుగా రెండు గంటల ఆలస్యంగా ఉదయం 7:45 గంటలకు విశాఖపట్నం నుండి బయలుదేరే విధంగా రీషెడ్యూల్ చేశారు.
3. సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (20834) రైలు సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే బదులు 1ః10 గంటల ఆలస్యంగా సాయంత్రం 4ః10 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది.
నాలుగు కోచింగ్ రైళ్ల షార్ట్ టెర్మినేషన్….
కేకే లైన్‌లోని బచేలి, కిరండూల్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా నాలుగు కోచింగ్ రైళ్లు షార్ట్‌టర్మినేట్ చేసినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు.
1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ స్పెషల్ (08551) రైలు సెప్టెంబర్ 25 వరకు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది.
2. కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08552) రైలు సెప్టెంబర్ 26 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి ప్రారంభమవుతుంది.
3. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్ (18514 ) రైలు దంతెవాడలో షార్ట్ టర్మినేట్ చేయబడుతుంది.
4. కిరండూల్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (18513) రైలు సెప్టెంబర్ 26 వరకు కిరండూల్‌కు బదులుగా దంతెవాడ నుండి బయలుదేరుతుంది. అందువల్ల పైన పేర్కొన్న తేదీలలో కిరండూల్-దంతెవాడ మధ్య ఈ రైలు సేవలు ఉండవు. ప్రజలు మార్పులను గమనించి తదనుగుణంగా వ్యవహరించాలని మేనేజర్ కె సందీప్ అభ్యర్థించారు.
రిపోర్టింగ్ - జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం