AP Bhavan Division : ఎట్టకేలకు ఏపీ భవన్ విభజన, కేంద్రహోంశాఖ ఉత్తర్వులు-delhi ap bhavan division between andhra pradesh telangana union home ministry released orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bhavan Division : ఎట్టకేలకు ఏపీ భవన్ విభజన, కేంద్రహోంశాఖ ఉత్తర్వులు

AP Bhavan Division : ఎట్టకేలకు ఏపీ భవన్ విభజన, కేంద్రహోంశాఖ ఉత్తర్వులు

Bandaru Satyaprasad HT Telugu
Mar 16, 2024 10:36 PM IST

AP Bhavan Division : దేశ రాజధాని దిల్లీలో ఉన్న ఏపీ భవన్ విభజన చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో తెలంగాణ 8.245 ఎకరాలు, ఏపీకి 11.536 ఎకరాలు కేటాయించింది.

పీ భవన్ విభజన
పీ భవన్ విభజన

AP Bhavan Division : పదేళ్లకు దిల్లీలోని ఏపీ భవన్(AP Bhavan) విభజనకు మోక్షం కలిసింది. ఏపీ భవన్‌ను విభజన చేస్తూ శనివారం కేంద్ర హోంశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ భవన్ విభజనపై తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు ఏపీ(AP Govt) అంగీకారం తెలిపింది. దిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది. ఇందులో తెలంగాణ(Telangana Share) వాటాగా 8.245 ఎకరాలు, ఏపీ వాటాగా11.536 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించారు. అలాగే ఏపీకి 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్‌ను కేటాయిస్తూ నిర్ణయించారు. అలాగే ఏపీకి నర్సింగ్ హాస్టల్‌లో 3. 359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.

yearly horoscope entry point

దిల్లీలో తెలుగువారికి చిరునామాగా నిలిచే ఏపీ భవన్ ఆస్తుల పంపకం ఎట్టకేలకు పూర్తైంది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన తర్వాత ఆస్తుల పంపకం కొలిక్కి రాకపోవడంతో రెండు తెలుగురాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. తాజాగా ఏపీ భవన్ విభజనపై కేంద్రహోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన సమయంలోనే ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు. దిల్లీ అశోకా రోడ్డుతో పాటు మాధవరావు సింథియా మార్గ్‌లో కలిపి రెండు రాష్ట్రాలకు 19.733 ఎకరాల భూమి ఉంది.

త్వరలో తెలంగాణ భవన్ నిర్మాణం

విభజన చట్టానికి అనుగుణంగా ఏపీ భవన్ విభజన పూర్తైందని తెలంగాణ ఆర్​ అండ్ బీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో పూర్తి చేసిందన్నారు. త్వరలోనే తెలంగాణ సంస్కృతీ సంప్రదాయలకు అనుగుణంగా దిల్లీలో తెలంగాణ భవన్(Telangana Bhavan) నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Whats_app_banner