CM Jagan| స్వాగతిస్తూనే అభ్యంతరాలు.. ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై మోదీకి జగన్ లేఖ-cm jagan wrote a letter to pm narendra modi on ias service rules ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Jagan| స్వాగతిస్తూనే అభ్యంతరాలు.. ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై మోదీకి జగన్ లేఖ

CM Jagan| స్వాగతిస్తూనే అభ్యంతరాలు.. ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై మోదీకి జగన్ లేఖ

HT Telugu Desk HT Telugu
Jan 29, 2022 06:54 AM IST

సమర్థులైన అధికారుల సారథ్యంలో కేంద్రవిభాగాలు పనిచేస్తే రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్, మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను స్వాగిస్తున్నానని, అయితే ఈ సవరణ వల్ల తలెత్తే కొన్ని సమస్యల గురించి కేంద్రం దృష్టికి వస్తున్నానని ఆయన స్పష్టం చేశారు.

<p>మోదీకి జగన్ లేఖ&nbsp;</p>
మోదీకి జగన్ లేఖ ( Hindustan times)

ఐఏఎస్ అధికారుల సర్వీసు నిబంధనలను సవరించాలనే కేంద్రప్రభుత్వ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమంత్రి జగన్ స్వాగతించారు. అయితే ఇదే సమయంలో కొన్ని పలు అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. కేంద్ర కోరినంతమంది ఐఏఎస్ అధికారులను పంపించేందు సిద్ధంగా ఉన్నామని, కానీ ఎవర్నీ పంపించాలో నిర్ణయించుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లే ఐఏఎస్ అధికారి రిపోర్ట్ చేసే గడువును నిర్ణయించే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ తీసుకుని వస్తున్న తాజా సవరణపై అభ్యంతరం తెలిపారు.

జగన్ అభ్యంతరాలు..

సమర్థులైన అధికారుల సారథ్యంలో కేంద్రవిభాగాలు పనిచేస్తే రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను స్వాగిస్తున్నానని, అయితే ఈ సవరణ వల్ల తలెత్తే కొన్ని సమస్యల గురించి కేంద్రం దృష్టికి వస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతితో, ఆ అధికారుల ఇష్టంతో సంబంధం లేకుండా కేంద్రం కావాలనుకున్న వారిని డిప్యూటేషన్‌పై తీసుకువచ్చని ప్రతిపాదించారు. అంతేకాకుండా రాష్ట్రప్రభుత్వం సదరు అధికారులను నిర్దేశిత గడువులోపు రిలీవ్ చేయాలని కోరారు. ఈ రెండు అంశాలపై కేంద్రం పునరాలోచించుకోవాలని జగన్ మోదీకి విజ్ఞప్తి చేశారు. డిప్యూటేషన్‌పై ఐఏఎస్ అధికారులు ఉన్నట్టుండి కేంద్ర విభాగాలకు వెళ్తే.. రాష్ట్రంలో వారు నిర్వర్తిస్తున్న విధులకు విఘాతం ఏర్పడుతుందని, కాబట్టి ఆ సమస్య రాకుండా ఎవర్ని పంపించాలో నిర్ణయించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించాలని కోరారు.

ఎన్ఓసీని అలాగే కొనసాగించండి..

కేంద్రానికి డిప్యూటేషన్‌పై వెళ్లే ఐఏఎస్ అధికారులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఓసీ(నిరభ్యంతర పత్రం) ఇస్తాయని,. తాజా ప్రతిపాదనతో ఈ నిబంధన తొలగించినట్లవుతుందని సీఎం జగన్ తన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని ఎన్ఓసీ ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కొనసాగించండి అనే విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా కేంద్రం ఎవర్ని కోరితే వారిని తక్షణం పంపాలనే నిబంధనపై కూడా పునరాలోచించుకోవాలని కోరారు.

ఇదిలా ఉండే ఐఎస్ అధికారుల సర్వీస్ నిబంధనల సవరణ ప్రతిపాదనను కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం ఈ అంశం కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చురేపేలా ఉంది. 9 రాష్ట్రాలు ఆ ప్రతిపాదనకు మద్దతు తెలపగా.. 9 రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బంగాల్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాదనను ఖండించాయి. అఖిల భారత సర్వీసులు(AIS) నిబంధనలు-1954కి మోదీ సర్కారు సవరణలు ప్రతిపాదించింది.

 

Whats_app_banner

సంబంధిత కథనం