CM Chandrababu : ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ, రుణాలు రీషెడ్యూల్ చేయాలని విజ్ఞప్తి
- CM Chandrababu Delhi Tour : దిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
- CM Chandrababu Delhi Tour : దిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. శనివారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
(1 / 8)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో ఆయనతో భేటీ అయిన సీఎం చంద్రబాబు గంట పాటు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
(2 / 8)
రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం దిల్లీకి చేరుకున్న చంద్రబాబు, శుక్రవారం రాత్రి కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చర్చించారు.
(3 / 8)
శనివారం ఉదయం కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మరో ఏడు విమానాశ్రయాలు ఏర్పాటుపై చర్చించారు.
(4 / 8)
శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. ప్రధాని మోదీని చంద్రబాబు కలవడం ఇది నాలుగో సారి. అయితే బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి కలిశారు.
(5 / 8)
ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని మోదీని చంద్రబాబు కోరారు. అలాగే కొత్త రుణాలపై కూడా ప్రధాని మోదీకి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వాలని కోరారు.
(6 / 8)
పోలవరం నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చు కేంద్రమే భరిస్తుందని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ నిధుల మంజూరుపై ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు చర్చించారు. అలాగే రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్లు ఇటీవలి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆ నిధుల విడుదల గురించి కూడా చంద్రబాబు ప్రధాని మోదీ వద్ద ప్రస్తావించారు.
(7 / 8)
ఎనిమిది వెనకబడిన జిల్లాలకు ఆర్థిక సాయం కింద నిధులు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కోరారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను చంద్రబాబు లేవనెత్తారు. బడ్జెట్ సవరించిన అంచనాల్లో ఏపీకి కేటాయింపులు పెంచాలని కోరారు.
ఇతర గ్యాలరీలు