Anna Canteens: గుడివాడలో అన్నా క్యాంటీన్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు-cm chandrababu and bhuvaneshwari couple started anna canteen in gudivada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Anna Canteens: గుడివాడలో అన్నా క్యాంటీన్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు

Anna Canteens: గుడివాడలో అన్నా క్యాంటీన్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు

Sarath chandra.B HT Telugu
Aug 15, 2024 01:17 PM IST

Anna Canteens: ఎన్డీఏ ఎన్నికల హామీల్లో ఒకటైన అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు గుడివాడలో లాంఛనంగా ప్రారంభించారు. ఏపీలో పేదలకు సబ్సిడీ ధరలకు భోజనం అందించేందుకు ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక మూతబడ్డాయి. ఎన్డీఏ అధికారంలోకి రావడంతో తిరిగి ప్రారంభించారు.

గుడివాడ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు
గుడివాడ అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు

Anna Canteens: పేదలకు పట్టెడన్నం పెట్టే లక్ష్యంతో ఏపీలో ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీల్లో భాగమైన అన్నా క్యాంటీన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు గుడివాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు నేటి నుంచి అందుబాటులో రానున్నాయి. రాష్ట్రంలోని అన్న జిల్లాల్లో 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు.

2018లో ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఇస్కాన్‌ నిర్వహణలో మూడు పూటల పేదలకు భోజన సదుపాయాన్ని సబ్సిడీ ధరలకు అందించేవారు. 5రుపాయలకే టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందించేవారు. 2019లో అవి మూతబడ్డాయి. 2024 ఎన్నికల హామీల్లో అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ఆగస్టు 15 సందర్భంగా అన్నా క్యాంటీన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చారు. గుడివాడ అన్నా క్యాంటీన్ ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి దంపతులు పేదలతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. ఆటోడ్రైవర్లు, ఫ్రూట్ వెండర్లు, గ్యాస్‌ సరఫరాదారుడు, రోజు కూలీలు, కుట్టు పని చేసే మహిళలు ముఖ్యమంత్రితో కలిసి పనిచేశారు.

రోజువారి పనులు చేసుకునే వారిని ఉపాధి అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ల నిర్వహణపై వారి ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రోజువారి వ్యాపారాలు చేసుకునే వారి అభ‌్యర్థనల్ని పరిగణలోకి తీసుకుని వారికి సాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ బాలాజీని సిఎం చంద్రబాబు ఆదేశించారు.

సొంత వ్యాపారాలు చేయడానికి సాయం చేయాలని అభ్యర్థించిన వారికి సాయం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వ్యాపారాలు చేసుకునే వారికి వ్యాపారంలో అదనపు ఆదాయం ఉండేలా ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేలా ప్రభుత్వం నుంచి సాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.

తనతో కలిసి భోజనం చేసిన పదిమందికి జీవనోపాధి అవకాశాలు మెరుగుపరిచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

తొలివిడతలో 100 అన్న క్యాంటీన్లు

తొలివిడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల మెను వివరాలను ప్రభుత్వం తెలిపింది. రూ.15 చెల్లిస్తే బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అందిస్తారు. సోమవారం నుంచి శనివారం వరకు అన్న క్యాంటీన్ లో ఆహార పదార్థాలు అందిస్తారు. ఆదివారం సెలవు ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ఉదయం 7.30 నుంచి 10.00 గంటల వరకు , లంచ్ మధ్యాహ్నం 12.30 నుంచి 3.00 వరకు, డిన్నర్ సాయంత్రం 7.30 నుంచి 9.00 వరకు. వారానికి ఒక రోజు స్పెషల్ రైస్ పెడతారు.

అన్న క్యాంటీన్ మెనూ

సోమవారం - బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ ,చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.

మంగళవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.

బుధవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.

గురువారం- బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.

శుక్రవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.

శనివారం- బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.