TTD Alipiri Restrictions: అటవీ శాఖ అనుమతిస్తేనే ఆంక్షలు తొలగిస్తామన్న భూమన-bhumana says that he will remove the restrictions on the walking path only if the forest department gives permission ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Alipiri Restrictions: అటవీ శాఖ అనుమతిస్తేనే ఆంక్షలు తొలగిస్తామన్న భూమన

TTD Alipiri Restrictions: అటవీ శాఖ అనుమతిస్తేనే ఆంక్షలు తొలగిస్తామన్న భూమన

HT Telugu Desk HT Telugu
Oct 03, 2023 11:46 AM IST

TTD Alipiri Restrictions: అలిపిరి నుంచి తిరుమలకు నడచి వచ్చే నడక మార్గంలో వన్య మృగాల నుంచి ఎలాంటి ముప్పు లేదని అటవీశాఖ అధికారులు ధ్రువీకరిస్తేనే 12 ఏళ్ల లోపు పిల్లల విషయంలో ఆంక్షలు సడలిస్తామని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేశారు.

నడకమార్గాన్ని పరిశీలిస్తున్న టీటీడీ ఛైర్మన్ భూమన
నడకమార్గాన్ని పరిశీలిస్తున్న టీటీడీ ఛైర్మన్ భూమన

TTD Alipiri Restrictions: తిరుమల నడక మార్గంలో వన్యప్రాణుల నుంచి చిన్నారులకు ఎలాంటి ముప్పు లేదని అటవీ శాఖ ధృవీకరించే వరకు ఆంక్షలు కొనసాగుతాయని భూమన చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకే నడకదారుల్లో చిన్నారులకు అనుమతి ఉంటుందని, భక్తుల భద్రతే తమకు ముఖ్యమన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ చైర్మన్‌ క్యూలైన్‌లను పరిశీలించారు.

yearly horoscope entry point

తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో సోమవారం చైర్మన్ క్యూ లైన్లను పరిశీలించారు. భక్తులకు ఆహారం, తాగునీరు , కాఫీ , టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. గోగర్భం సర్కిల్ నుండి కృష్ణతేజ సర్కిల్ వరకు క్యూ లైన్లను పరిశీలించారు.

పెరటాశి మాసం, సెలవుల కారణంగా గత నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, క్యూ లైన్లు 4 నుండి 5 కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరిత గతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పం తో వి ఐ పి బ్రేక్ , సుపథం, స్లాటెడ్ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చైర్మన్ చెప్పారు.

క్యూ లైన్లలో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని చెప్పారు . అక్టోబరు 15నుండి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటుంటున్నామని తెలిపారు.

తిరుమలలో విపరీత మైన భక్తుల రద్దీ ఉండటంతో ఈవో, జేఈవో, సివిఎస్వో, ఆరోగ్యం ఇతర అధికారులందరూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ క్యూలైన్లు పరిశీలిస్తూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని చైర్మన్ చెప్పారు. తిరుమలకు భక్తులు పోటెత్తడంతో వీరు ప్రత్యక్షంగా ఏర్పాట్లు పరిశీలిస్తూ భక్తులకు చిన్న ఇబ్బంది కూడా కలక్కుండా పని చేస్తున్నారని చైర్మన్ అభినందించారు.

భక్తులకు ఆహారం, తాగునీరు, కాఫీ, టీ, మజ్జిగ అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గోగర్భం సర్కిల్‌ నుంచి కృష్ణతేజ సర్కిల్‌ వరకు క్యూలను తనిఖీ చేశారు. అనంతరం చైర్మన్‌ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పెరటాశి మాసం, సెలవుల కారణంగా నాలుగు రోజులుగా తిరుమలలో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నారు.

క్యూలు నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరం వెళ్లాయని, ఇలాంటి భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శనం చేయించాలనే సంకల్పంతో వీఐపీ బ్రేక్, సుపథం, స్లాటెడ్‌ దర్శనం టోకెన్ల జారీ కూడా రద్దు చేసినట్లు చెప్పారు. క్యూల్లో ఉండే భక్తులు ఎక్కడా అసహనానికి లోను కాకుండా అవసరమైన తగిన వసతులు కల్పించామని తెలిపారు. ఈ నెల 15 నుంచి జరిగే నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారనే అంచనాతో అవసరమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.

Whats_app_banner