AP TET Final Key : ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(AP TET 2024) తుది కీ విడుదలైంది. విద్యాశాఖ ఏపీ టెట్-2024 తుది కీ విడుదల చేసింది. అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లో టెట్ ఫైనల్ కీ చెక్ చేసుకోవచ్చు. టెట్ ఫలితాలు షెడ్యుల్ ప్రకారం నవంబర్ 2న విడుదల చేయనున్నట్లు విద్యాసాఖ తెలిపింది. అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్షలు జరిగాయి. 17 రోజల పాటు రోజుకు రెండు విడతలుగా టెట్ పరీక్షలు నిర్వహించారు. టెట్ ప్రైమరీ 'కీ' లను పరీక్ష మురుసటి రోజు నుంచి వెబ్ సైట్ లో విడుదల చేశారు. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ అనంతరం టెట్ తుది కీ విడుదల చేశారు.
టెట్ పరీక్షల ప్రైమరీ కీ, రెస్పాన్స్ షీట్లను ఇప్పటికే విడుదల చేసిన విద్యాశాఖ, అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది. టెట్ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అప్లై చేసుకోగా, 3,68,661 మంది సుమారు 86.28 శాతం హాజరయ్యారని విద్యాశాఖ తెలిపింది. టెట్ పరీక్ష జరిగిన తర్వాతి రోజును అంటే అక్టోబర్ 4 నుంచి ప్రైమరీ ఆన్సర్ కీ ని విద్యాశాఖ విడుదల చేసింది. అక్టోబర్ 5 నుంచి అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణకు విండోను ఓపెన్ చేసింది. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏపీ పాఠశాల విద్యాశాఖ టెట్ ఫైనల్ ఆన్సర్ కీ-2024ను ఇవాళ విడుదల చేసింది. టెట్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://aptet.apcfss.in/ ద్వారా ఫైనల్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఏపీ టెట్ తుది ఫలితాలను నవంబర్ 2, 2024న ప్రకటించనున్నారు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు 60 శాతం కాగా బీసీ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ , మాజీ సైనికులు, వికలాంగ (PH) అభ్యర్థులకు 40 శాతం ఉత్తీర్ణతగా నిర్ణయించారు. కనీసం 40% వైకల్యం ఉన్న డిఫరెంట్లీ ఎబిలిటీ (విజువల్లీ, ఆర్థోపెడికల్, వినికిడి లోపం, ఆటిజం) అభ్యర్థులుగా పరిగణిస్తారు.
ఏపీ మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. నవంబర్ మొదటి వారంలో మెగా డీఎస్సీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కోర్టు వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తుంది. ఏపీ మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు 7,725, టీజీపీ పోస్టులు 1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులు 286, ప్రిన్సిపాళ్లు 52, పీఈటీలు 132 పోస్టులు ఉన్నాయి.