AP Joint Staff Council: ఎటూ తేల్చకుండానే ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్… ఉద్యోగ సంఘాల అసంతృప్తి
AP Joint Staff Council: ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఆర్ధికేతర అంశాలకు పరిమితం కావడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఉద్యోగుల సమస్యలు, బకాయిలపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Joint Staff Council: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ Employees Unions సంఘాలతో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం.. ఎటూ తేల్చకుండానే ముగియడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.
సాధారణ ఎన్నికలకు Elections ముందు నిర్వహించే చివరి సమావేశం కావడంతో ఆర్ధిక అంశాలపై స్పష్టత వస్తుందని భావించిన ఉద్యోగ సంఘాలకు భంగపాటు తప్పలేదు. మధ్యంతర భృతి, ఇతర ఆర్థిక అంశాలపై ఎలాంటి హామీ లభించలేదని భేటీ తర్వాత ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
ఆర్ధికేతర Non Finance అంశాలకు మాత్రమే పరిమితం కావాలని స్పష్టం చేయడంతో ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. ఆర్ధికేతర అంశాలపై కూడా స్పష్టమైన హామీలు ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి,రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు Pending Dues 21వేల కోట్లు ఉన్నాయని,వాటి ప్రస్తావన లేకుండా సమావేశం జరపడంపై ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పిఆర్సీ ఆలస్యం అవుతున్నందున మధ్యంతర భృతి ఇవ్వాలని నాయకులు చేసిన ప్రతిపాదనల్ని అధికారులు తిరస్కరించారు. గురుకులాలు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసును 62ఏళ్లకు పెంచడం లేదని స్పష్టంచేశారు.
జడ్పీ ఉపాధ్యాయుల కారుణ్య నియామకాల్లో అర్హుల జాబితా రూపొందించడం, నగదు రూపంలో పెన్షనర్లకు ఇవ్వాల్సిన పిఆర్సీ బకాయిలను వెల్లడించడం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, సెలవుల విషయాలపై చర్చ జరగలేదని ఉద్యోగుల ప్రతినిధులు ప్రకటించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ సర్వీసు అంశాలతో పాటు ఆర్ధికేతర అంశాలపై చర్చించి వాటి సత్వర పరిష్కారానికి తీసుకోవలాల్సిన చర్యలపై సంబంధిత శాఖాల అధికారులకు సిఎస్ .జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
వివిధ శాఖల్లో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ,పెండింగ్ బిల్లులు మంత్రుల బృందం సమావేశంలో తీసుకున్న గడువు ప్రకారం చెల్లించడం,ఉద్యోగుల ఆరోగ్య పధకాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడం వంటి పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.
సమావేశంపై ఉద్యోగుల నిరాశ….
ఎన్నికల కోడ్ రానుండడంతో ఉద్యోగ సంఘాలతో జరిగే చివరి సమావేశం కావడంతో శుభవార్త చెబుతారని ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆశపడ్డారు. ఐఆర్ ప్రకటిస్తారని భావించినా నిరాశ తప్పలేదు.
‘‘ఆర్థికేతర డిమాండ్లపైనే మాట్లాడాలని…ఆర్థిక డిమాండ్లపై ఇప్పటికే మంత్రుల కమిటీ చెప్పిందే ఫైనల్’’ అని సీఎస్ స్పష్టం చేయడంతో సమావేశం ఎలాంటి ఫలితాన్నివ్వకుండానే ముగిసింది. ఈ సమావేశం వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు.
సమావేశంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు శివారెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ, ఎస్టీయూ అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ఏపీటీఎఫ్ అధ్యక్షుడు హృదయరాజు, ఏపీ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు బాలాజి తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, 2004కు ముందు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలుపై స్పష్టత ఇవ్వాలని కోరిన అధికారులు స్పందించలేదని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించారు. విద్యాశాఖలో క్రమబద్ధీకరణ చేయకపోవడం బాధాకరమని, మెడికల్ హెల్త్ కార్డులపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటామని చెప్పారని వెల్లడించారు. క్షులు శివారెడ్డి...
‘‘నాన్ ఫైనాన్స్ సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో కోరినట్టు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు శివారెడ్డి తెలిపారు. 12వ పీఆర్సీలో ఐఆర్ ఇవ్వాలని కోరామని, 11 పీఆర్సీలో ఇవ్వాల్సిన ఆరియర్స్ త్వరగా విడుదల చేయాలని కోరినట్టు చెప్పారు.