Telugu News  /  Andhra Pradesh  /  Ap Ground Water Department Released Technical Assistant Posts Recruitment Notification 2022
74 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు
74 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు (apsgwd.ap.gov.in)

AP Govt Jobs : 74 టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్.. కేవలం ఇంటర్వూనే

23 September 2022, 21:32 ISTHT Telugu Desk
  • Share on Twitter
  • Share on FaceBook
23 September 2022, 21:32 IST

APSGWD Jobs 2022: ఏపీ భూగర్భ జలం, జల గణన శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధిచి వివరాలను వెల్లడించింది.

APSGWD Technical Assistant Recruitment 2022: ఏపీ ప్రభుత్వానికి చెందిన భూగర్భ జలం, జల గణన శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒప్పంద ప్రాతిపదికన జిల్లాల వారీగా.. 74 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్‌ 30వ తేదీని దరఖాస్తులకు తుది గడువుగా ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే... కేవలం ఇంటర్వూల ఆధారంగా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి అక్టోబర్‌ 11న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

ముఖ్య వివరాలు ఇవే....

మొత్తం పోస్టుల సంఖ్య - 74

అర్హతలు - డిప్లొమా(సివిల్‌ ఇంజనీరింగ్‌)తోపాటు సంబంధిత పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు రూ.18,000(టూర్‌ అలవెన్స్‌ నెలకు రూ.5000)

వయసు - 31.03.2022 నాటికి 35ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరితేది: 30.09.2022

ఇంటర్వ్యూ తేది: 11.10.2022

ఇంటర్వూ జరుగు స్థలం : సంబంధిత జిల్లా భూగర్భ జల, జల గణన శాఖ అధికారి కార్యాలయాల్లో నిర్వహిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.apsgwd.ap.gov.in/

జిల్లాల వారీ ఖాళీలు:

కాకినాడ- 02

డా.అంబేడ్కర్‌ కోనసీమ- 01

తూర్పుగోదావరి- 02

పశ్చిమ గోదావరి- 01

ఏలూరు- 02

కృష్ణా- 02

ఎన్టీఆర్‌- 02

గుంటూరు- 01

పల్నాడు- 03

బాపట్ల- 01

ప్రకాశం- 04

నంద్యాల- 03

కర్నూలు- 03

అనంతపురం- 05

శ్రీ సత్యసాయి- 03

వైఎస్ఆర్, కడప- 04

ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు- 05

తిరుపతి- 04

అన్నమయ్య- 04

చిత్తూరు- 04

శ్రీకాకుళం- 02

విజయనగరం- 01

పార్వతీపురం మన్యం- 02

అల్లూరి సీతారామ రాజు- 04

విశాఖపట్నం- 02

అనకాపల్లి- 02

డైరెక్టర్ కార్యాలయం, జీడబ్ల్యూ అండ్ డబ్ల్యూఏడీ, విజయవాడ- 05