AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత, రోబోటిక్ విధానంలో సర్జరీ!-ap governor abdul nazeer suffered stomach ache shifted to manipal hospital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత, రోబోటిక్ విధానంలో సర్జరీ!

AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అస్వస్థత, రోబోటిక్ విధానంలో సర్జరీ!

Bandaru Satyaprasad HT Telugu
Sep 18, 2023 10:09 PM IST

AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి నుంచి ఆయన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయనను తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు.

గవర్నర్ అబ్దుల్ నజీర్
గవర్నర్ అబ్దుల్ నజీర్

AP Governor : ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి నుంచి గవర్నర్ కు కడుపులో నొప్పి రావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. గవర్నర్‌ కు వైద్య పరీక్షలు చేసి రోబోటిక్ విధానంలో సర్జరీ చేసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌కు కడుపులో నొప్పి రావడంతో సోమవారం ఉదయం రాజ్ భవన్ వెళ్లిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆయనను మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో మణిపాల్ ఆస్పత్రిలో తరలించారు. గవర్నర్ కు శస్త్ర చికిత్స చేసినట్లు, రేపు డిశ్చార్జి చేస్తామని మణిపాల్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

అపెండిసైటిస్ సమస్య

గవర్నర్‌జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్‌ ఆసుపత్రి హెల్త్ బులిటెన్‌ విడుదల చేసింది. గవర్నర్ కడుపు నొప్పి సమస్యతో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా, అపెండిసైటిస్‌ సమస్యతో బాధపడుతున్నట్టు తేలిందన్నారు. గవర్నర్‌కు రోబోటిక్ అసిస్టెడ్ అపెండిసిటోమీ విజయవంతంగా నిర్వహించినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు హెల్త్ బులిటెన్‌లో వైద్యులు పేర్కొన్నారు. కడుపు నొప్పి రావడంతో అస్వస్థతకు గురైన గవర్నర్‌ సోమవారం మధ్యాహ్నం తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.

Whats_app_banner