ఏఎన్‌యూ ఐసెట్‌, పీజీసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు.. ఐసెట్‌కు జూలై 2 వ‌ర‌కు, పీజీసెట్‌కు జూలై 18 వ‌ర‌కు పొడిగింపు-anu icet and pgcet application deadline extended ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏఎన్‌యూ ఐసెట్‌, పీజీసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు.. ఐసెట్‌కు జూలై 2 వ‌ర‌కు, పీజీసెట్‌కు జూలై 18 వ‌ర‌కు పొడిగింపు

ఏఎన్‌యూ ఐసెట్‌, పీజీసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు.. ఐసెట్‌కు జూలై 2 వ‌ర‌కు, పీజీసెట్‌కు జూలై 18 వ‌ర‌కు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 06:45 AM IST

ఆచార్య నాగార్జున యూనివ‌ర్శిటీ (ఏఎన్‌యూ)లో ఐసెట్‌, పీజీసెట్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి గ‌డువు పెంచారు. ఏఎన్‌యూ ఐసెట్‌కు జూలై 2 వ‌ర‌కు గ‌డువు పొడిగించ‌గా, ఏఎన్‌యూ పీజీసెట్‌కు జూలై 18 వ‌ర‌కు గ‌డువు పెంచారు.

ఏఎన్‌యూ ఐసెట్‌, పీజీసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం)
ఏఎన్‌యూ ఐసెట్‌, పీజీసెట్ ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు (ప్రతీకాత్మక చిత్రం) (Hindustan Times)

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సెల్ఫ్ సపోర్టు కేటగిరిలో నిర్వహిస్తున్న ఏఎన్‌యూ ఐసెట్ 2024కు సంబంధించి దరఖాస్తు గడువును పొడిగించినట్లు అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జి. అనిత తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై రెండవ తేదీలోగా వెయ్యి రూపాయల అపరాధ రుసుము చెల్లించి ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు.

అర్హత పరీక్ష జూలై మూడవ తేదీన నిర్వహిస్తారు. ఈ అర్హత పరీక్ష ద్వారా ఎంబీఏ కేటగిరిలో ఎనిమిది కోర్సులను అందించనున్నట్లు డాక్టర్ అనిత తెలిపారు.

ఎంసీఏ, ఎంబీఏ జ‌న‌ర‌ల్‌, ఎంబీఏ హాస్పిట‌ల్ అడ్మినిస్ట్రేష‌న్‌, ఎంబీఏ టూరిజం ట్రావెల్ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ ఇంటర్నేష‌నల్ బిజినెస్‌, ఎంబీఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌, ఎంబీఏ మీడియా మేనేజ్‌మెంట్, ఎంబీఏ టెక్నాల‌జీ మేనేజ్‌మెంట్ కోర్సుల‌ను అందిస్తున్నారు. ఈ కోర్సుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకువారు యూనివర్శిటీ వెబ్ సైట్ www.anu.ac.in ను సందర్శించాలి. అందులో అద‌న‌పు స‌మాచారంతో కూడిన బ్రోచ‌ర్‌, అలాగే అప్లికేష‌న్ ఉంటుంది. అప్లికేష‌న్ డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సెల్ప్ స‌పోర్టు కోర్సుల విద్యార్థులు ఎటువంటి ప్ర‌భుత్వ ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌, స్కాల‌ర్‌షిప్స్ ప‌థ‌కాల‌కు అర్హులు కారు.

అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరి (ఒసీ) విద్యార్థుల‌కు రూ. 850, బీసీ విద్యార్థుల‌కు రూ. 750, ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులైన విద్యార్థుల‌కు రూ. 650గా ఉంది. అయితే ఇప్పుడు గ‌డువు పెంచ‌డంతో ఈ ఫీజుల‌కు ఆయా కేట‌గిరి విద్యార్థులు అద‌నంగా రూ. 1,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఏఎన్‌యూ పీజీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అందిస్తున్న ఏఎన్‌యూ పీజీ సెట్ 2024 కు సంబంధించి దరఖాస్తు గడుగు జూలై 18వ తేదీ వరకు పొడిగించినట్లు అడ్మిషన్ల డైరెక్టర్ డాక్టర్ జి .అనిత తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుము చెల్లించి ద‌రఖాస్తు చేసుకోవచ్చు. పీజీసెట్ ప్ర‌వేశ‌పరీక్ష జూలై 20 ఉంటుంది. సెల్ఫ్ సపోర్టు కేటగిరి విధానంలో ఈ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

పీజీ కోర్సుల్లో ఎంఏ, ఎంఎస్‌సీ, ఎం.కామ్, ఎంఏ (జేఎంసీ), ఎంపిఏ, ఎంపీఈడీ, ఎంఈడి, ఎంఎల్ఐఎస్‌సీ కోర్సులు ఉన్నాయి. వివరాలకు యూనివర్శిటీ వెబ్ సైట్ www.anu.ac.in సందర్శించాలని డాక్టర్ అనిత సూచించారు. అయితే ఈ సెల్ప్ స‌పోర్టు కోర్సుల విద్యార్థులు ఎటువంటి ప్ర‌భుత్వ ఫీజు రీయంబ‌ర్స్‌మెంట్‌, స్కాల‌ర్‌షిప్స్ ప‌థ‌కాల‌కు అర్హులు కారు.

అప్లికేష‌న్ ఫీజు జ‌న‌ర‌ల్ కేట‌గిరి (ఒసీ) విద్యార్థుల‌కు రూ.850, బీసీ విద్యార్థుల‌కు రూ.750, ఎస్‌సీ, ఎస్‌టీ, విక‌లాంగు విద్యార్థుల‌కు రూ.650 ఉంది. అయితే ఇప్పుడు గ‌డువు పెంచ‌డంతో ఈ ఫీజుల‌కు ఆయా కేట‌గిరి విద్యార్థులు అద‌నంగా రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది.

రిపోర్టింగ్: జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

టాపిక్