Yerneni Sitadevi : గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత-amaravati ntr cabinet minister vijaya dairy director yerneni sita devi died ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Yerneni Sitadevi : గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

Yerneni Sitadevi : గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

HT Telugu Desk HT Telugu
May 27, 2024 05:31 PM IST

Yerneni Sitadevi : మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి గుండెపోటుతో కన్నుమూశారు. 1988లో ఆమె ఎన్టీఆర్ కేబినెట్ లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
గుండెపోటుతో మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత

Yerneni Sitadevi : మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాదులో మృతి చెందారు. సీతాదేవి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె 1985, 1994లో రెండుసార్లు టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1988లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఆమె విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె 2013లో బీజేపీలో చేరారు.

సీతాదేవి భర్త నాగేంద్రనాథ్ ఏపీ రైతాంగ సమాఖ్య, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు. సీతాదేవి, నాగేంద్రనాథ్ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. ఆయన కూడా కైకలూరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.‌ సీతాదేవి మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు సంతాపం తెలిపారు. రేపు ఆమె స్వస్థలంలో అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది.

'1985,1994లలో ముదినేపల్లి శాసనసభ్యురాలిగా, 1988 లో నందమూరి తారకరామారావు కేబినెట్ లో విద్యాశాఖా మంత్రిగా పనిచేసిన నిగర్వి, స్నేహశీలి అయిన యెర్నేని సీతాదేవికి నా నివాళులు' అని పురంధేశ్వరి ట్వీట్ చేశారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner