AIIMS Mangalagiri Recruitment : ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు..వివరాలివే-aiims mangalagiri issued faculty recruitment adverisement 2023 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aiims Mangalagiri Recruitment : ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు..వివరాలివే

AIIMS Mangalagiri Recruitment : ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు..వివరాలివే

HT Telugu Desk HT Telugu

AIIMS Mangalagiri Recruitment 2023: ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగ ప్రకటన విడదలైంది. మొత్తం 68 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎయిమ్స్, మంగళగిరిలో ఉద్యోగాలు (faceook)

AIIMS Mangalagiri Jobs 2023: ఎయిమ్స్ మంగళగిరిలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో భాగంగా మొత్తం 68 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ప్రొఫెసర్లు, అడిషనల్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. జనవరి 15వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది.

ముఖ్యవివరాలు:

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 68

పోస్టులు: ప్రొఫెసర్లు, అడిషనల్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు.

డిపార్ట్ మెంట్లు: నెఫ్రాలజీ, గైనకాలజీ, పాథాలజీ, సైకియాట్రీ, ఫిజియాలజీ, యూరాలజీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, జనరల్‌ మెడిసిన్ తదితరాలు.

అర్హతలు:

ఆయా పోస్టులకు సంబంధించి అర్హతలు వేర్వురుగా ఉన్నాయియ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 14ఏళ్లు పని అనుభవం ఉండాలి.వయసు: 58 ఏళ్లు మించకూడదు.

అడిషనల్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌/డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.వయసు: 58 ఏళ్లు మించకూడదు.

అసోసియేట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ /ఎంఎస్‌ /ఎంసీహెచ్‌ /డీఎం ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 6 ఏళ్లు పని అనుభవం ఉండాలి.వయసు: 50 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/ఎంసీహెచ్‌ /డీఎం/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 3 ఏళ్లు పని అనుభవం ఉండాలి.వయసు: 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు రూ.1,01,500 నుంచి రూ.1,68,900 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

చివరితేది: 15.02.2023.

అధికారిక వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in/

ఈ కింద ఇచ్చిన పీడీఎఫ్ లో పూర్తి వివరాలను తెలుసుకోవచ్చ.