శరీరంలో కొలెస్ట్రాల్‍ను సహజంగా తగ్గించగల పండ్లు ఇవి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 13, 2024
Hindustan Times Telugu
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. గుండె వ్యాధుల రిస్క్ పెరుగుతుంది. కొలెస్ట్రాల్ తగ్గేందుకు కొన్ని రకాల పండ్లు సహాయపడతాయి. అవేవంటే..
Photo: Pexels
నారింజ పండు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది. ఇందులోని విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఇది తింటే కొవ్వు తగ్గేందుకు తోడ్పడుతుంది.
Photo: Pexels
అవకాడోలో మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి. శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఇది సహకరిస్తుంది.
Photo: Pexels
దానిమ్మ పండ్లలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్టెస్ తగ్గడంలో సహకరిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గేలా చేయగలవు.
Photo: Pexels
యాపిల్ పండ్లలో సోలబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపకరిస్తుంది.
Photo: Pexels
స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, బ్లాక్ బెర్రీలు సహా మిగిలిన బెర్రీల్లో పోలిఫెనాల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తాయి.
Photo: Pexels
బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్ మెండుగా ఉంటాయి. దీంతో ఫైబర్ కూడా మెండుగా ఉంటుంది. దీంతో బొప్పాయి కూడా కొలెస్ట్రాల్ తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
Photo: Pexels
చలికాలంలో పుదీనాతో ఆరోగ్య ప్రయోజనాలు - తెలిస్తే అస్సలు వదలరు