తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila: విజయమ్మ రాజీనామాపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే….

YS Sharmila: విజయమ్మ రాజీనామాపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే….

HT Telugu Desk HT Telugu

08 July 2022, 18:57 IST

    • ys sharmila on vijayamma resignation: వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేయడంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. ఆమె ఏమన్నారంటే…
వైఎస్ విజయమ్మతో షర్మిల
వైఎస్ విజయమ్మతో షర్మిల (twitter)

వైఎస్ విజయమ్మతో షర్మిల

ys sharmila reaction on vijayamma resignation: వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం కోసం 20 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె… కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ బరిలో ఉంటుందని స్పష్టం చేశారు.

ఇక ఆమె తల్లి విజయమ్మ వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... దాటవేసే ప్రయత్నం చేశారు. ఎక్కడో ఏదో జరిగిందని దానిపై ప్రశ్నలు వేయటం సరికాదన్నారు. అయినా ఇవాళ వైఎస్ఆర్ జయంతి అని ఇలాంటి సమయంలో... వివాదాస్పదం చేయవద్దని సున్నితంగా రిప్లే ఇచ్చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు ఎవరన్న ప్రశ్నకు కూడా.. ఆమె జవాబు దాటవేశారు.

రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్...

ys sharmila fiers on revanth reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై షర్మిల ఘాటుగా స్పందించారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. మరణంపై తరువాత ఎఫ్ఐఆర్ లో పేర్లు చేర్చే పరిస్థితికి తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి ప్రకటనలకు విశ్వసనీయత లేదని కొట్టిపారేశారు.

ఎన్టీఆర్ పేరును ప్రశంసిస్తూ.. రాజశేఖర్ రెడ్డి పేరు వినబడకుండా కేసీఆర్ తొక్కేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. రాజశేఖర్ రెడ్డి స్మృతివనం కోసం పోరాటం చేస్తామని ప్రకటన చేశారు.

తదుపరి వ్యాసం