తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Women's Day Special | ఉమెన్స్ డే స్పెషల్.. వారికి టీఎస్ఆర్టీసీలో ఆ రోజు ఫ్రీ.. లక్కీ డ్రా కూడా..

TSRTC Women's Day Special | ఉమెన్స్ డే స్పెషల్.. వారికి టీఎస్ఆర్టీసీలో ఆ రోజు ఫ్రీ.. లక్కీ డ్రా కూడా..

HT Telugu Desk HT Telugu

07 March 2022, 10:27 IST

    • ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. సజ్జనార్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రయాణికులకు దగ్గర చేసి.. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళల కోసం కొత్తగా మరో ఆఫర్ ప్రకటించారు.
టీఎస్ఆర్టీసీ
టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ

టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ప్రజా రవాణాలో కీలక మార్పులు చేసే దిశగా సజ్జనార్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో టీ-24 టిక్కెట్‌పై మార్చి 8 నుంచి 14 వరకూ 20 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. ఈ ఆఫర్ వరంగల్ లోనూ ఉంది. మరోవైపు గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఆర్డినరీ, లేదా ఎక్స్‌ప్రెస్‌ బస్సులు ఎక్కితే.. వారి సౌకర్యార్థం రెండు సీట్లు కేటాయిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Mulugu District : లిఫ్ట్ ఇచ్చి రేప్..! అడవిలో అంగ‌న్వాడీ టీచ‌ర్ హత్య

Karimnagar Rains : అకాల వర్షాలు, తడిసిపోయిన ధాన్యం..! అన్నదాత ఆగమాగం

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ హాల్ టికెట్లు విడుద‌ల‌ - డౌన్లోడ్ లింక్ ఇదే

Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

అంతేకాదు.. మార్చి 31 వరకూ మహిళా ప్రయాణికులకు లక్మీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తారు. ఈ లక్కీ డ్రా విజయం సాధిస్తే.. నెల రోజుల పాటు డిపో నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో ఉచితంగా ప్రయాణించొచ్చు. ప్రత్యేక బహుమతులు కూడా పొందొచ్చు. అయితే లక్కీ డ్రాలో పాల్గొనేందుకు.. టిక్కెట్‌‌తో పాటు, ప్రయాణికురాలి ఫొటో 9440970000 నెంబర్ కు వాట్సాప్ పంపాలి. 2022 ఏప్రిల్ 2న బస్ భవన్‌లో లక్కీ డిప్ నిర్వహించి.. విజేతలకు ప్రత్యేక బహుమతిని సంస్థ అందించ‌నుంది.

మరోవైపు.. మార్చి 8వ తేదీన 60 ఏళ్లపై బ‌డిన మ‌హిళ‌ల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్టు తెలిపారు. ఈ ఆఫ‌ర్ మార్చి 8వ తేదీ రోజు మాత్రమే ఉండనుంది. ఈ అవ‌కాశాన్ని 60 ఏళ్ల పై బ‌డిన మ‌హిళ‌లు వినియోగించుకోవాల‌ని టీఎస్ఆర్టీసీ కోరింది.

సూదూర ప్రయాణం చేసే ప్రయాణికులు.. ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది. రోడ్డు పక్కన దాబాల వద్ద ఆపి టీ, కాఫీ, స్నాక్స్ తీసుకుంటుంటారు. బస్సుకోసం ఎదురు చూసే సమయంలో టీ, స్నాక్స్ కోసం చూస్తారు. అయితే.. ఈ విషయాన్ని.. ఆర్టీసీనే ఏర్పాటు చేసేలా ప్రయాణికులు చేస్తోంది. గరుడ, రాజధాని బస్సుల కోసం బస్ స్టేషన్లలో ఎదురు చూసే ప్రయాణికులకు సాయంత్రం 4 నుంచి చివరి బస్సు వరకు కాఫీ, టీ, స్నాక్స్, తాగునీరు అందజేయనున్నట్టు పేర్కొంది.

తదుపరి వ్యాసం